Sankaramanchi RamaKrishna Sastry-శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
శంకరమంచి రామకృష్ణ శాస్త్రి-- సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు. ఈయన శంకరమంచి గా పిలువబడుతున్నాడు. ఈయన వైదిక జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు. ఈయన జ్యోతిష శాస్త్రంలో 18 సంవత్సరాల అనుభవం గలవాడు. యాజుష స్మార్తము చదివి, పురోహితునిగా 25 సంవత్సరముల అనుభవం కలవాడు. ఖగోళ శాస్త్రంలో 13 సంవత్సరాల అనుభవజ్ఞుడు, పంచాంగకర్త.పైన తెలిపిన రంగాలలో అనేక మంది నిష్ణాతులు ఉన్నప్పటికీ, అన్ని రంగాలలోను పరిచయమున్న వ్యక్తి ఆయన. ఆయన ఎం.ఎ. పట్టాలను సంస్కృతం, జ్యోతిషం మరియు తెలుగు లలో పొందాడు. ఆయన "ఉన్నత పదవి - రాజయోగం" అనే అంశంపై పరిశోధనలు చేసి, డాక్టరేటు పట్టా పొందాడు. ఆయన 37000 మంది ప్రముఖ వ్యక్తుల జాతక చక్రాలను పరిశీలించి, పరిశోధనలు చేశాడు. ఆయన చేసిన కృషికి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని పొందాడు. జ్యోతిష వేత్తలుగా, పురోహితులుగా, పంచాంగకర్తలుగా చాలామంది ఉన్నా, జ్యోతిషంలో శాస్త్రీయంగా పరిశోధనలు చేసి, పి.హెచ్ డి పట్టాను పొందిన వారు తెలుగువారిలో అరుదు. ఇతడు అటువంటి అరుదైన వ్యక్తి.గౌరవ బిరుదములు : దైవజ్ఞ రత్న
దైవజ్ఞ శిరోమణి
పురోహిత సార్వభౌమ
స్వర్ణ కంకణ సన్మానిత
సరస్వతీ పుత్ర
విద్యా వాచస్పతి
జ్యోతిష సార్వభౌమ
జ్యోతిష మార్తాండ
ఉత్తమ పంచాంగకర్త
అవార్డులు :
రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పండిత పురస్కారాలను మూడుసార్లు(1999, 2000, 2001.) అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ద్వారా పొందాడు.\
మాజీ అసెంబ్లీ స్పీకరు డి.శ్రీపాదరావు నుండి 8.7.98 న "విద్యా వాచస్పతి" అవార్డును అందుకున్నారు.
కేంద్ర మంత్రి టి సుబ్బిరామిరెడ్డి నుండి పండిత పురస్కారాన్ని అందుకున్నాడు.
తే.11.2.2010ది. న రమణాచారి(ఐ.ఎ.ఎస్) నుండి కౌముది ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాడు.
తే,6.4.2000 ది. న అవధాన సరస్వతి మాడుగుల నాగఫణిశర్మ నుండి స్వర్ణ సింహతలాట కంకణం పొందాడు.
రాష్ట్ర మంత్రులైన టి.సీతారాం, మురళీ మోహన్ గార్ల నుండి సరస్వతీ పుత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.
వేద పాఠశాల, శంకర విద్యాలయం,బాపట్ల నుండి "జయపత్రిక" అనే సర్టిఫికెట్టు ను పొందాడు.
Source : Wikipedia.org