Charles Babbage,చార్లెస్ బాబేజ్

Charles Babbage,చార్లెస్ బాబేజ్

కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు చార్లెస్ బాబేజ్. 1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంపతులకు లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులను కేంబ్రిడ్జ్‌లోని రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో పూర్తిచేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ

నుంచి గౌరవపట్టా పొందారు. కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా కొంతకాలం పనిచేసి మంచి గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు పొందారు.

సొంతంగా గణనలు చేసే యంత్రానికి బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్ కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు అని పిలిచారు.

రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ బాబేజ్ తయారు చేశారు. గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు. బాబేజ్ జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థను కూడా స్థాపించారు. 1871లో 79వ ఏట మరణించారు.