Alfred Nobel

ఆల్ ఫ్రెడ్ నోబెల్-AlfredNobel జననం ----- అక్టోబర్ 21, 1833మరణం డిసెంబర్ 10, 1896వృత్తి రసాయనశాస్త్రవేత్త, ఇంజనీరు, డైనమైట్ను కనుగొన్నవాడు.ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ - (21 అక్టోబర్ 1833, స్టాక్‌హోం, స్వీడన్ – 10 డిసెంబర్ 1896, సన్రీమో, ఇటలీ) ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు , 1885లో ఆల్ ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో నోబెల్ శాంతి బహుమతి ఎలాంటి వారికి ఇవ్వాలో చాలా వివరంగానే ప్రస్తావించారు. . కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.

జీవితం

ఆల్ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు. తరవాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.

ఆల్ఫ్రెడ్ నోబెల్ కి వివాహము కాలేదు . తన జీవితాంతము బ్రహ్మచారిగానే ఉంది శాస్త్ర పరిశోధనకే జీవితాన్ని అంకితం చేశారు కాని ముగ్గురు ప్రేయసీ లు ఉండేవారని అంటారు . ౧ . రష్యా లో "అలెగ్జాండ్ర (Alexandra)" , ౨ . ౧౮౭౬ లో బెర్త కిన్స్కై(BerthaKinsky)" , ౩. వియన్నా కి చెందిన - సోఫీ హేస్ (Sofie Hess from Vienna) ,