Dr. Yellapragada Subba Rao

డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు (1895-1948): ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త. ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్‌ కార్బామజీన్‌ అనే మందును కనుగొన్నారు. 1945లో ఆరియోమైసిన్‌ అనే యాంటీబయోటిక్‌ మందును ఆవిష్కరించారు. పాండురోగ నివారణకు పోలికామ్లం, క్షయ రోగానికి పసోనికోటినికాసిడ్‌ హైడ్రోజన్‌లను కనుగొన్నారు. ఆంధ్రులు గర్వించదగ్గ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త.యల్లాప్రగడ సుబ్బారావు - జనవరి 12,1895-పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక నిరుపేద కుటుంబములో జన్మించారు. తండ్రి : జగన్నాధం , తల్లి : వెంకాయమ్మ , ఆగష్టు 9,1948 na భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి.... సుబ్బారావు చనిపోయారు .హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను.సుబ్బారావు సహచరుడు మరియు 1988లో గెట్రూడ్ ఎలియాన్ తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".

కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము(ఫంగస్)నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.

INVENTIONS