Frank Whittle - ఫ్రాంక్‌ విటిల్

విమానాలపై ఆసక్తితో 15 ఏళ్లకే బ్రిటిష్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగానికి ప్రవేశ పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాడు. అయితే పొట్టిగా, పీలగా ఉన్నందున ఎంపిక కాలేదు. అయినా పట్టువదలకుండా కఠినమైన వ్యాయామాలు చేస్తూ శరీర దారుఢ్యాన్ని అభివృద్ధి చేసుకుని తర్వాతి ఏడాది మళ్లీ పరీక్షలకు హాజరై మెకానిక్‌గా ఎంపికయ్యాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే విమానాల నమూనాలను చేస్తుండేవాడు. వాటిని గమనించిన కమాండింగ్‌ అధికారి అతడిని ఆఫీసర్‌ శిక్షణకు ఎంపిక చేశాడు. అందులో కొనసాగుతూనే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ సైన్సెస్‌ అధ్యయనం చేశాడు. ఆ సమయంలోనే భూమి నుంచి బాగా ఎత్తుగా, అత్యధిక వేగంతో విమానాలు నడవాలంటే ఎలాంటి ఇంజిన్‌ ఉండాలో వివరిస్తూ పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రకటించాడు. ఆ ఆలోచనల ఫలితమే అతడు రూపొందించిన టర్బోజెట్‌ ఇంజిన్‌. ప్రొపెల్లర్‌, పిస్టన్‌లతో కూడిన అప్పటి విమానాలకు భిన్నంగా అత్యధిక పీడనం కలిగిన వాయు ఇంధనాన్ని మండించే అతడి ఇంజిన్‌ నమూనాకు 1930లోనే మేధోహక్కులు లభించినా, తయారీకి ప్రభుత్వ సాయం అందలేదు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రభుత్వం చూపిన ఆసక్తి కారణంగా ఫ్రాంక్‌ రూపొందించిన టర్బోజెట్‌ ఇంజిన్‌తో తొలిసారిగా జెట్‌ విమానం 1941లో గగనవిహారం చేసింది. ఫ్రాంక్‌విటిల్‌ ఆవిష్కరణకు ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ, నైట్‌హుడ్‌ లాంటి ఎన్నో గౌరవాలు, సత్కారాలు లభించాయి.

Courtesy :Enadu telugu daily

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు


ఇంగ్లండ్‌లోని కొవెంట్రీలో 1907 జూన్‌ 1న పుట్టిన ఫ్రాంక్‌విటిల్‌ తండ్రి ఓ సాధారణ మెకానిక్‌. ఇంటి దగ్గరే ఉన్న ఒక పరిశ్రమలో విమానాల తయారీని ఆసక్తిగా గమనిస్తూ ఎదిగిన అతడు పెద్దయ్యాక పైలట్‌ కావాలని కలలు కనేవాడు. హైస్కూలు దాటి కళాశాల స్థాయికి చేరేసరికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగింది. తండ్రి ప్రారంభించిన వర్క్‌షాప్‌లో పనిచేస్తూనే తీరిక చిక్కినప్పుడల్లా గ్రంథాలయానికి వెళ్లి నక్షత్రశాస్త్రం, శరీర తత్వశాస్త్రం, ఇంజినీరింగ్‌ గ్రంథాలను అధ్యయనం చేశాడు.

నాలుగేళ్ల వయసున్న ఓ కుర్రాడికి తండ్రి ఓ విమానం బొమ్మను స్వయంగా తయారు చేసి ఇచ్చాడు. దాంతో అపురూపంగా ఆడుకున్న ఆ బుడతడు పెరిగి పెద్దయ్యాక విమానాలకే వేగాన్ని నేర్పాడు. అత్యంత వేగంతో ప్రయాణించే జెట్‌ విమానానికి నాంది పలికిన శాస్త్రవేత్త అయ్యాడు. అతడే సర్‌ ఫ్రాంక్‌ విటిల్‌. అతడు రూపొందించిన జెట్‌ తొలిసారిగా 1941 మే 15న అంతకు ముందు ఏ విమానమూ ఎగరని 25,000 అడుగుల ఎత్తులో, గంటకు సుమారు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి సంచలనం సృష్టించింది.

జెట్‌ విమానానికి ఆద్యుడు!--> ఆకాశంలో తెల్లని చారను ఏర్పరుస్తూ ప్రయాణించే జెట్‌ విమానాన్ని చూస్తూ ఉంటారు కదా? ఈసారి చూసినప్పుడు ఫ్రాంక్‌ విటిల్‌ పేరును తల్చుకోండి. ఎందుకంటే దాన్ని కనుగొన్నది ఆయనే. ఇవాళ ఆయన పుట్టిన రోజు!