Milton Lasell Humason

శాస్త్రవేత్త కావాలంటే పట్టాలు, పి.హెచ్.డి. లు అక్కర్లేదు. ఎందుకటే శాస్త్రీయత అనేది మనసుకి సంబంధించినది, ఒక విధమైన మానసిక దృక్పథానికి సంబంధించినది. ఏ పట్టాలూ లేకపోయినా సైన్సు అంటే అపారమైన ప్రేమ కలిగి, పని పట్ల వెలితిలేని అంకితభావం కలిగిన కొందరు మేటి ఏకలవ్య శాస్త్రవేత్తలు ఉన్నారు. పదో క్లాసు కూడా పాసు కాని అలాంటి ఓ ఏకలవ్య శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రంలో ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశల్లో ఓ అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించాడు. అతడి పేరు మిల్టన్ హుమాసన్.

మిల్టన్ హుమసన్ అమెరికా ఖగోళ శాస్త్రజ్ఞుడు . మిన్నెసోట లో దొడ్జి సెంటర్(Dodge Center, Minnesota.) లో 19 ఆగష్టు 1891 లో జన్మించారు .18 జూన్ 1972 న మెందోసినో (కాలిఫోర్నియా) లో చనిపోయారు .

పెద్దగా చదువుకోలేదు . పర్వతాలంటే ఇష్టము ముక్యం గా విల్సన్ పర్వతము (MountWinson ) 1917 మౌంట్ విల్సన్ ఓబ్జర్వతరీ (MountWilsonObservatory) స్థాపించడం జరిగి అక్కడ "MuleSkinne " గా జాయిన్ అయ్యాడు .

1905 ఆధునిక విజ్ఞానం ఓ పెద్ద మలుపు తిరిగిన సంవత్సరం. ఐన్స్టయిన్ తన సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రచురించిన సంవత్సరం. ఆ ఏడాది మిల్టన్ హుమాసన్ జీవితం కూడా ఓ ముఖ్యమైన మలుపు తిరిగింది. పద్నాలుగేళ్ల మిల్టన్ ఆ వేసవిలో కాలిఫోర్నియాలో, లాస్ ఏంజిలిస్ కి కాస్త ఉత్తరాన ఉన్న పాసడేనా కి చేరువలో ఉన్న మవుంట్ విల్సన్ మీద సమ్మర్ క్యాంపుకి వెళ్ళాడు. చల్లని పచ్చిక మీద పడుకుని చీకటి ఆకాశంలో మినుకు మినుకు మంటున్న తారలని తనివి తీరా చూసుకుంటూ వేసవి నెలలు గడిపేశాడు. తిరిగి ఇంటికి, బడికి వెళ్లాలని అనిపించలేదు. కాని వెళ్లక తప్పింది కాదు. ఆ పర్వతం, ఆ పరిసరాలు బాగా నచ్చేశాయి. ఇంటికి వెళ్లాక వాళ్ల అమ్మ, నాన్నలతో ఆ విషయమే నసుగుతూ చెప్పాడు. వాళ్లది పెద్దగా ఉన్న కుటుంబం కాదు. పైగా మిల్టన్ కూడా బడి చదువులలో రాణించే రకం కాదని వారికి తెలుసు. మౌంట్ విల్సన్ దరిదాపుల్లో ఏదైనా ఉద్యోగం వెతుక్కుని ఓ ఏడాది పాటు పని చెయ్యడానికి తల్లిదండ్రలు ఒప్పుకున్నారు. మౌంట్ విల్సన్ హోటెల్ లో ఓ పని కుర్రాడిగా చేరాడు మిల్టన్. ఏడాది కాలం పాటు అలా కష్టపడ్డాక కాలేజి మీదకి పిల్లవాడి మనసు మళ్లొచ్చని తల్లిదండ్రులకి ఒక ఆశ. కాని అలాంటిదేం జరక్కపోగా మౌంట్ విల్సన్ మీద మిల్టన్ ప్రేమ మరింత హెచ్చయ్యింది.

హ్యూగో బెనియోఫ్ అనే రీసెర్చ్ స్కాలర్ తన సెలవుదినాలలో మౌంట్ విల్సన్ వేధశాలలో పని చెయ్యడానికి వచ్చాడు. దూరదర్శినితో ఎలా ఫోటోలు తియ్యాలో హుమాసన్ కి నేర్పించాడు. హుమాసన్ లో ఓ గొప్ప లక్షణం అతని అపారమైన సహనం. ఆ ఓర్పు మరి మొండి ఘటాలైన మ్యూల్ జంతువులతో వ్యవహరించడం వల్ల వచ్చిందేమో తెలీదు. లేక సైన్స్ అంటే ఆసక్తి ఉండడం వల్ల సహజంగా వచ్చింది కావచ్చు. సెలవు ముగిశాక బెనియోఫ్ వెళ్లిపోయాడు. హుమాసన్ మాత్రం ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కొనసాగించాడు.

స్లిఫర్ కి సాధ్యం కాని పనిని, హబుల్ తన 100-ఇంచిల దూరదర్శినితో సాధించాలని పూనుకున్నాడు. దూరదర్శిని శక్తివంతమైనదే అయినా ఆ రోజుల్లో అంతరిక్షంలో అంతంత దూరాలు చూసిన వీరుడు లేడు. అప్పటికే హబుల్ కి అంతరిక్షంలో విపరీతమైన దూరాలు కొలవడంలో గొప్ప పేరుంది. అయితే తను చేపట్టిన పని సాధించడానికి కౌశలమే కాక, గొప్ప సహనం కూడా కావాలి. చెప్పలేనంత ప్రయాసతో కూడుకున్న పని అది. అదంతా తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని హబుల్ కి తెలుసు. ఈ ప్రయాసలో తనకి కుడిభుజంలా ఉండే వాణ్ణి వెతుక్కోవాలి. మౌంట్ విల్సన్ వేధశాలలో హుమాసన్ కి అప్పటికే మంచి పేరు ఉంది. తన పనికి హుమాసన్ నే ఎంచుకున్నాడు హబుల్.

వెస్టో స్లిఫర్ అమెరికాలో, ఆరిజోనా రాష్ట్రంలోని ఫ్లాగ్స్టాఫ్ నగరంలో లొవెల్ వేధశాలలో పనిచేసేవాడు. పార్సివాల్ లొవెల్ అనే వ్యాపారస్థుడు ఇచ్చిన విరాళంతో నిర్మించబడింది ఈ వేధశాల. ఓ విచిత్రమైన లక్ష్యంతో నిర్మించబడిన వేధశాల ఇది. ’మార్స్ మీద జీవరాశులు ఉన్నాయా?’ అన్న ప్రశ్నని శోధించడమే ఆ లక్ష్యం.

కామెట్ రేస్ ను కనిపెట్టేడు . హుమసన్ వర్క్ అంతా హబ్బుల్ కి క్రెడిట్ అయ్యేది .