Marcopolo-మార్కోపోలో

మార్కో పోలో (Marco Polo) (సెప్టెంబరు 15, 1254 – జనవరి 9, 1324 లేదా జూన్ 1325) ఒక వర్తకుడు మరియు యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్ కు చెందినవాడు. ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, .పోలో తన తండ్రియైన నిక్కోలో మరియు పినతండ్రి మాఫ్ఫియో తో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు) మరియు చెంగీజ్ ఖాన్ మనుమడు మరియు యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ ను కలిసాడు.

మనదేశానికి చాలామంది విదేశీయులు వచ్చి వెళ్ళారు. వారిలో మార్కో పోలో చాలా ముఖ్యుడు. ఇతని మూలంగా భారత దేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది.

పదమూడో శతాబ్దంలో కాకతీయ రుద్రమదేవి కాలంలో మన ప్రాంతాలకూ, ఇతర దేశాలకూ ప్రయాణించిన వెనిస్‌ నావికుడు మార్కోపోలో వివిధ దేశాల, జాతుల ప్రజలను పరిశీలించి, సక్రమంగా విశేషాలను సేకరించాడు