అధ్యాయం - 9
||సీ.|| భక్తుల రక్షించు భవదీయ చూడ్కులు
శ్రీరామ శ్రీకృష్ణ ఈశ్వరులలొ
ఎవరెవ్వరే రూపమున బిల్వ పలికేవు
వెనువెంట నిల్చేవు వీపుతట్టి
దీర్ఘవ్యాధుల బాపి దీర్ఘాయువుల జేయు
కలిసాయి చింతన బలిమి గాదె
దీనులందరు తమ దీనగాధలు దెల్ప
ప్రత్యక్షదైవమై బ్రోచినావు
||గీ.|| పంచ శూనాది పాప నివారణకును
దాన శీలంబు సంసార ధర్మమనుచు
చాటి జెప్పిన గుణ శీలి సాటిలేరు
సకల సద్గుణ ధామ ఒం సాయిరామ ||21||