అధ్యాయం - 15
||సీ.|| చక్కర లేకుండ చోళ్కరు తేనీరు
సేవించి మిగులుతో షిర్డి యాత్ర
సేయ సంకల్పింప సాయినాధుడు మది
సంతసంబొంది దర్శనమునిచ్చి
చోళ్కరు మనసునుప్రకటింప మదినెంచి
విరివిగా చక్కరవేసినట్టి
తేనీరు నిమ్మని దెలిపి జోగుకపుడు
యాశ్చర్య పరచెను యందరెదుట
||ఆ.వె.|| పేదవారి గాచు పెన్నిధి మనసాయి
కరుణ గలిగినంత కలుగు సిరులు
వింతగాదు మీరు విన్నపములు సేయ
సకల సుగుణ శీలి సాయిరామ||27||