అధ్యాయం - 14
||సీ.|| రాతంజి వాడియా వితరణ శీలంబు
నందేడు నివసించు నాగరికులు
పొగడు వారే గాని తెగడు వారే లేరు
షాపుర్జి ఐశ్వర్య సంపదలకు
వెనుక విషాదంబు విపరీతమైనది
పుత్ర సంతతిలేని వింత క్షోభ
దాసగణుని మాటతో సాయినాధుని
పుత్రసంతతి కోరె పుణ్యమూర్తి
||గీ.|| కడగి ఋణమున్న రూపాయి రెండణాలు
దక్షిణనుగొని దాక్షిణ్యలక్షితముగ
పెక్కు సంతాన మోసగెను ప్రేమ తోడ
సకల సద్గుణధామ జై సాయిరామ ||26||