అధ్యాయం - 3

||సీ.|| దృష్టి మరల్చి నా రూపంబు దర్శించు

నెట్టి వారికి నేమి కష్టమైన

గలుగనీయను వారికనుమానమే వద్దు

సృష్టి స్థితి లయ కారుండనేను

సూత్రధారిని నేను పాత్రధారులు మిమ్ము

సరిదారి నడిపించి సకల సుఖము

లిచ్చి మాయను గడతేర్చి మనుపు చున్న

నన్ను మరచు వాడు తన్ను మరచు


||ఆ.వె.|| తన్ను దాతెలిసియు దైవంబు గన్గొనం

బాడియగు నరులకు పుడమి యందు

తానెవరొ తెలియక తప్పియించుటది యేల?

సకల సుగుణ శీలి సాయి రామ ||5||


అధ్యాయం - 4