అధ్యాయం - 24
||సీ.|| నీపాద సేవను నిత్యమ్ముజేయుచూ
మావిశీబాయి అణ్ణాలు నాడు
కలహింప వృద్ధుల కయ్యంబు జూచుచూ
నవ్వంగ పడిపడి నచటివారు
సాయినాధుడు మరి శాంతచిత్తముతోడ
వృద్ధుల నగుబాటు సద్దుజేయ
తల్లిని ముద్దాడ తనయుని తప్పెట్లు
తల్లి బిడ్డల వావి ధరణియందు
||ఆ.వె.|| అతి పవిత్ర మగుట అభ్యంతరమదేల
అవని జనులకెల్ల అమ్మ వరము
అనుచు నావిధముగ నాశీర్వదించెను
సకల సుగుణ శీలి సాయిరామ ||41||