అధ్యాయం - 36
||సీ|| బాబదర్శనముకై వచ్చిరిద్దరు గోవ
భక్తులు ప్రణమిల్లి బాబకపుడు
సాష్టంగపడి నిల్వ సాయి దక్షిణడిగె
రూకలు పదునైదు యొకనినుండి
యడగనతను ముప్పదైదు రూప్యములివ్వ
వారించి యతనికి తిరిగి యిచ్చె
యేమి కారణమని శ్యామడిగిన యంత
పాతబాకీలున్న వారినుండి
||ఆ.వె.|| మాత్రమే మసీదు మాయిగైకొను గాని
యెవరినేమి యడుగనెన్నడైన
ఋణము తీరివాడు ఋణవిమోచన(బొందు
సకల సుగుణ శీలి సాయి రామ ||108||
||సీ|| తిరుగుచు తీరాన తిన్నగా నొకచోట
భవనంబు జూచితి భాగ్యవశము
భవన వసారాలొబడలి కూర్చొనియుండ
లోనికి పిల్చి భోజనము పెట్టి
నిద్రించ స్థలమిచ్చి నిమ్మళముగనేను
నిద్రలోనుండగా నీచబుద్ధి
తీసి రాతిపలక చేసి గోడ బిలము
నపహరించెను ద్రవ్యమంతనాది
||ఆ.వె.|| లేచి చూడ లేవు లెఖ్ఖముప్పది వేలు
నోట్ల కట్టబాపడెట్లు చేసె
ననుచు నేడ్చితి పదునైదు రోజులటుల
సకల సుగుణ శీలి సాయి రామ ||109||
||సీ|| అటుల నేడ్చుచు నుండ నౌలియా యొక్కండు
నాపైన దయతల్చి నన్ను బిల్చి
శిరిడి యందు కొలువు దీరిన సాయిని
దల్చుచూ మదినంత దనుక నీవు
నత్యంత ప్రియమైనయాహారమును పరి
త్యజియింతునని మ్రొక్కియాన సేయ
బాపును నీబాధ బాబాకరుణతోడ
యనిజెప్పి నంతనే మనసులోన
||ఆ.వె.|| మ్రొక్కులిడితి నాదు మొరవినె నాసాయి
కరుణ బాపడొచ్చి తిరిగి నాకు
యిచ్చె పైకమంత వేడుచు శరణంబు
సకల సుగుణ శిలి సాయి రామ ||110||
||సీ|| కనంప్;పించి కార్యోన్ముఖుని చేసిన ఫకీరు
సంశయమే లేదు సాయివిభుడె
పేరాశ పడబోరు వారుముప్పదియైదు
రూపాయలకు, నాదురొక్కమంత
మరల యిప్పించిన మహనీయుడాతండు
మదిని వేరే కోర్కెయేదిలేక
మమ్ములాధ్యాత్మిక మార్గమ్మునడిపించు
సద్గురుండాతండు మద్గురుండు
||ఆ.వె.|| పోయినట్టి సొమ్ము పొందినానందాన
మర్చి, గాంచి స్వప్నమందు సాయి
నిశ్చయించితి మదినే శిర్డికేగగా
సకల సుగుణ శీలి సాయి రామ ||111||
||సీ|| నిశ్చయించి మదినినే వెళ్లితిని గోవ
యట నుండి పోవ బొంబాయికపుడు
హార్బరు నందోడ నసలు దొర్కక చోటు
వివశుడనై యుండ వింత గొలిపి
నౌక రపరిచితుం డొక్కండు చెప్పగా
నొప్పు కొనియె కాప్టెనపుడు మేము
శిర్డి చేరితి మటనుండి రెయిలు లోన
మాయదృష్టంబిట్లు మమ్ము తెచ్చె
||ఆ.వె.|| శిరిడి వాసులార మీరు మాకంటెను
ధన్యజనులు బాబ దగ్గరుండి
యాడి పాడి మాటలాడుచు గడిపేరు
సకల సుగుణ శీలి సాయి రామ ||112||
||సీ|| ఔరంగబాదుకర్ భార్య షోలాపూరు
వాసి యిరువదేడు వత్సరములు
సంతతి లేకెంతొ చింతిలి యుండెను
విశ్వనాధుండను సవతి కొడుకు
తోడ శిరిడి వచ్చె వేడుకొనగ బాబ
నేకాంతమందు ననేక రోజు
లైన గాని తనకు యవకాశమేరాక
విషయము శ్యామతో విన్నవింప
||తే.గీ.|| పూజ సామగ్రి తో సాయి భోజనమ్ము
అయిన పిమ్మట మస్జీదు వాకిటుండి
సైగ చేసినంతనె రమ్ము సాయిదరికి
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||113||
||సీ|| అటులెననుచు యొక్క నాటి మధ్యాహ్నంబు
సాయి భోజనమైన సమయమరసి
మస్జీదు వాకిట పూజ సామగ్రితో
వేచియుండి శ్యామ పిల్చినంత
వడివడి జని సాయి పాదాల పైబడె
నోట మాటయె రాక నొదిగినిల్చె
యామె టెంకాయను శ్యామామె తరపున
బాబ చేతికి నిచ్చి భక్తురాలి
||ఆ.వె.|| కోర్కెను వివరించి కొండంత నాశతో
వచ్చె ననుచు సంత తిచ్చి నీవు
కరుణతోడ నామె కాపాడవలెనింక
సకల సుగుణ శీలి సాయి రామ ||114||
||సీ|| కదిలించి కొబ్బరి కాయనపుడు సాయి
కదులు నేదియొలోన కదిపి(జూడ
మనగ నట్లొక బిడ్డడామె గర్భమునందు
కదలాడ వలెనంచు వదలకుండ
వరమియ్యగా శ్యామ పట్టుపట్టిన యంత
కొబ్బరికాయెట్లు కోర్కె దీర్చు
లోకులు వెడగులా లోకాన యిదినమ్మ
కొట్టు మనగ శ్యామ కోర్కె దీర్చు
||ఆ.వె.|| మనగ నభయ మిచ్చినంత కాయను కొట్టి
సగము తినగ మిగులు సగము నిచ్చి
చెప్పె యేటి లోపు చేతబిడ్డతో రమ్ము
సకల సుగుణ శీలి సాయి రామ ||115||
||సీ|| సాయి పల్కులకేను, సాయి మరియు నీవు
గా సాక్షు లేడాది గాక ముందు
తల్లిగా లేకున్న, తరమ కున్నను సాయి
మస్జీదు నుండి నే మాధవుడను
గానంచు పంపించె కరుణ నాశీస్సుల
న్నంది నిజ గృహంబు లందు జనిరి
సంవత్సరము లోపె చంటి బిడ్డతో వచ్చి
దంపతుల్దర్శించి దక్షిణిచ్చె
||తే.గీ.|| నైదు వందల రూపాయలపుడు 'శ్యామ
కర్ణఅంప్;#39;యను యశ్వముకు శాల కట్టినారు
తనరు నౌరంగబాదుకర్ ధన్య జీవి
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||116||
||సీ|| ఆత్మాను సంధానమందు నుండెడు సాయి
కొన్ని వేళల యందు కూడి శిరిడి
జనులతోడ కడగి జనజీవనంబున
కష్ట సుఖాదు లంగంగొనితన
భక్తుల గృహ కుటుంబ సమస్యలకు పరి
ష్కార మార్గము జూపి గాచుచుండె
యితరయోగుల మల్లె చెప్పి తోచినదేదో
వారి బాధకు వార్ని వదలకుండ
||ఆ.వె.|| చేతనైనదెల్ల చేసి వారికి చిత్త
శాంతి కలుగ జేసె సాయివిభుడు
సంపదుండి చిత్త శాంతి లేదెందర్కొ
సకల సుగుణ శీలి సాయి రామ ||117||