అధ్యాయం - 18,19
||సీ.||హరివినాయకసాఠె యార్తి చెందెను మది
మిత్రులసలహాతొ షిరిడి చేరి
శుద్ధ స్వరూపుండు సిద్ధ యోగీశ్వరు
సాయి సన్నిధిలోన శాంతి బొంది
గురు చరిత్రను యొక్కవారంబు రోజుల
లో పూర్తి గావించి స్వప్న మందు
సాయి బోధనసేయ శ్రద్ధగా వినునట్లు
దీక్షితుకెరిగించి దీని భావ
||గీ.|| మేమి యననేడు దినములు మించి చదువు
మన్న బాబ యానతి నరమరికలేక
సాఠె చేసె పారాయణ సక్రమముగ
సకల సద్గుణధామ జై సాయి రామ ||29||
||సీ.||సాఠేకు చేసిన సాయి బోధ సరళి
పదసేవ చేస్థున్న పంతు మదిని
చాతక పక్షిబో సప్త వత్సరములు
బాబా దయామృతావర్షమునకు
తాగంపెడాశతో తపియించ ఫలమేమి
టనుకొన్న హేమాద్రి మనసెరింగి
శ్యామతో భాషించి రమ్మని పంపించె
హేమాద్రి గ్రహియించె శ్యామ ఇంట
||తే.గీ.|| నాథ భాగవతము నందు నాడు చదువ
మర్చినపుటలు చదివింపదల్చి సాయి
శ్యామ ఇంటికి పంపునెపమ్మదియని
సకల సద్గుణధామ జై సాయి రామ ||30||
||సీ.|| శ్యామ కథలువిన్న హేమాద్రి మదియందు
బాబాకు భక్తులపైన దయను
వింత పద్ధతులందు వివిధోపదేసాల
వెనంపు పరీక్షల వైనముగని
బాబాను గురువుగా భావించి యుపదేశ
మొసగ రాధాభాయినుపవసించి
మోడు నాళ్ళైనదీ ముదుసలి చనిపోవు
నని శ్యామ బాబాకు విన్నవించె
||తే.గీ.|| ముదుసలిని ప్రేమతో భక్తి ముఖ్యమనియు
నేను గురునుపదేశ మందినదిలేదు
నీకునుపదేశమెట్లిత్తు? నిక్కమిదియె
సకల సద్గుణధామ జై సాయిరామ ||31||