అధ్యాయం - 1

||సీ.|| విందుగ నొక్కనాడు దయంబు మనసాయి

గోధుమల్విసరంగ గుంపు చేరి

యాశ్చర్యమునజూచునంతలో నల్గురు

జెవరాండ్రు ధైర్యంబు చేసియపుడు

పిడిపట్టి తిరగలి వడిదిప్పి పిండినీ

పంచుకొనగ చూచె వడివడిగను

పసిగట్టియది సాయి పడతుల దరిజేరి

ఇదియేమి పనియని నిలువరించి


||గీ.|| అబ్బ సొమ్మనుకుంటిరా యకట మీరు

యనుచు నాపిండి గ్రామ సర్హద్దులందు

జల్లుడని జెప్పి యాశ్చర్య చకితు జేసె

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||1||


||సీ.|| గోధుమ పిండెలా వ్యధినీ బాపెనో

యను సంశయంబులు యపుడుకలిగె

భక్త జనుల కెల్ల భగవంతు డిలయందు

సాయి భక్తుల కెట్టి యాపదైన

దరిజేరగా నేరదని యంచు నారీతి

వాడవాడల షిర్డి వాసులంత

యెలుగెత్తి చాటగా పలుదూరదేశాల

వాసులందరు గూడ వచ్చి చేర


||గీ.|| షిర్డి యయ్యెను ఒక పుణ్యక్షేత్రమపుడు

సాయినాధుడె యందున్న సద్గురుండు

ఇహపరంబులనిచ్చేటి ఈశ్వరుండు

సకల సద్గుణ ధామ ఓం సాయిరామ ||2||

అధ్యాయం - 2