అధ్యాయం - 16,17
||సీ.||ధనికుడొకడు వచ్చి దర్శించి సాయినీ
పరగ బ్రహ్మ జ్ఞాన వరమునివ్వ
మనివేడి కూర్చుండ మాటమార్చిన సాయి
నందుమార్వడి వద్ద నైదు రూప్య
ములడిగి తెమ్మని బాలకునంపగా
రిక్త హస్తముల చేరెను యతండు
ధనికుడూరక జూచె తనకేమి పట్టక
సాయి చెప్పదొడంగె సభ్యులకును
||గీ.|| బుద్ధి యహమును మనమును ఇంద్రియములు
నైదును ప్రాణములునైదు నవిరళముగ
నర్పణము సేయ బ్రహ్మము నరయవచ్చు
సకల సద్గుణ ధామ ఓం సాయిరామ ||28||