శ్రీ శ్రీ కామేశ్వరీ దేవి శతకము
గౌరి ప్రియతనూజు గణనాథుని గొలుతు
భక్త ప్రియుడు వజ్రి వాన్దితుడగు
గుజ్జు వేల్పు గొలుతు గుంజిళ్ళు తీయుచు
శతకరచన విఘ్న శాంతి కొరకు
సురుచిర భవహరి శుభకరి
సురపుష్పము లిక్షుదండ శోభితకరముల్
అరుదగు హరితాంబర ధరి
వర కామేశ్వరి భజింతు వాక్సుధ్ధికిటన్
కలిని ధర్మంబు శాంతియునిలుపువాని
సిరియు భూమాత లెదతేనె చిలుకు వాని
అనిమిషులు మానవుల పూజ లందువాని
విజయ సిధ్ధికై వేంకట విభుని గొలుతు
పదియు నారేండ్ల ప్రాయంపు బాలుడుగను
శిరిడి వెలసినాడిల సిఢ్ధ పురుషుడతడు
ఆర్త రక్షణా శీలమ్ము నలరు యోగి
పుంగవుని గొల్తు వాక్శుధ్ధి పొందుటకును
దశాశ్వు పుత్ర నుఛ్ఛరాశి తన్వి సప్త నేత్రియున్
దశార్ధ పాదముల్లతాంగి ద్వాదశంబు మధ్యమున్
యశశ్వి ద్వాదశార్దురమ్ము లన్నవమ్ము వాహనున్
దశార్దినిన్ మనస్సులో సదాభజించి వేడెదన్
పరాత్పరీ శివాంగనా శుభంకరీ సుమంగళీ
విరాజమాన కీర్తిశాలి విన్ధ్యవాసి సుందరీ
పురాంతకీ మఖాంతకీ సుపూజితా సుపర్వకే
మరాళ మందగామినీ హ్యుమామహేశ్వరీం భజే
తుండపు వేల్పు కమ్మయగు తోయజనేత్రికి కోమలాంగికిన్
అండకటాహమాత సుజనాశ్రితపాలికి చండ్రచూడకు
దండ నిశాచరాంతకి కి తాండవకేళి విలాసి కిక్షుకో
దండ కరాబ్జ ధారికిట దండము సేతు సభక్తి కమ్ముగన్
అంబకు నబ్ధి మేఖల సుఖాసనశీలికి, నాదిశక్తికిన్
అంబర వీధులన్నడరు అండజయానకు, నంబుజాక్షికిన్
అంబుధి శాయి సోదరికి, అర్కనిశాకర కన్నుదోయికా
దంబరిగొల్చి మ్రొక్కెద నుదాత్త పదంబులు పల్లవించగన్
II.వంశక్రమమ్ / పూనిక ,విధానం -- అభ్యర్దన
గొర్తివారి వంశ గొత్రమ్ము శ్రీవత్స
అమృతమయము అమ్మ అన్నపూర్ణ
తండ్రి రామమూర్తి తనరు నాతొలిఒజ్జ
గర్వపడుదు వారి గరిమగాంచి.
వారిసుతుడ సూర్యనారాయణుండను
పద్య రచన సేయ నుద్యమించి
కడగి శతక రచన కామేశ్వరి కరుణ
చేసినాడ జనుల చిత్తమలర
శ్రీకరంబైన కామేశ్వరి మరంద
వాక్కుమేరకు శతకంబు వ్రాయబూని
మహిమ నీదె నేను నిమిత్తమాత్రుడనగ
వేడ్క నాశీస్సులిచ్చె నా వెన్నుతట్టి
పన్ని దంబు లేదు విన్నదేదియు లేదు
చిత్తమందు లేదు చిత్రముగను
తలచుకొంటి నాడు కలలోన గంటిని
దేవి క్రుపను పొంది దివ్య వరము
ముందు మాయిలవేల్పుకు మ్రొక్కి నేను
వ్రాయబూనిన శతకమ్ము పద్దియముల
దోషమెంచక పొరపాట్లు దొరలియున్న
విబుధు లాశీస్సు లర్ధింతు వినయముగను
వాడి తేటగీతి పాదమకుటమును
వాసిచూసి మార్పు చేసినాడ
కాని మార్చలేదు కామేశ్వరీనామ
మన్ని పద్దియముల నమరియుండు
తేటగీతిపాద మకుటతీరునందు
వాసికై మార్పులను జేసి వ్రాసినాడ
గాని కామేశ్వరీ నామ గరిమ చెలగు
నన్ని పద్యమ్ము లందునా చెన్నుమీర
గొర్తి వారి వంశ గుంపు గుత్తమ్ముగా
గుణము, విద్య, బుద్ధి, ఫణము లిచ్చి
మమ్ముగాచు దేవి అమ్మ కామేశ్వరీ!
మాదు పూజలంది ఆదుకొనవె
III.శతక పద్యాలు -- భక్తి
శ్రీ సుదాబ్ధి మణిద్వీప వాసివీవు
శ్రీ సహస్రార కమల నివాసివీవు
శ్రీ మహారాజ్ఞి సంత్రాణ శీలవీవు
శక్తి రూపి కామేశ్వరీ శరణు శరణు
భక్త సంరక్ష శీల కృపాంబు రాశి
వరసుధా కల్పవల్లి సౌభాగ్య ధాత్రి
శుద్ధ సన్మంగళాకారి బుద్ది ధాత్రి
వచనబద్ధ కామేశ్వరీ వరము లిమ్మ
మీన నయనాల మిరుమిట్లు మించు బోడి
నిండు కాటుక కరిమబ్బు నీడలలర
నాసికాగ్రాన మౌక్తిక భాసితముగ
చిందు దరహాస కామేశ్వరిందు ముఖియె
పరగ గురువార వ్రతములు జరుపు కొనుచు
నిరత నీరాజనములతో నిన్నుకొలిచి
కడగి సాష్టాంగములు నీకు పడెడు మమ్ము
కరుణ కామేశ్వరీ దేవి కావు మమ్మ
అనుదినము సేయు పూజల నన్దు కొనుచు
సకల సౌభాగ్య శుభములు శాన్టి నిచ్చి
మాదు సుద్ద కోర్కెల దీర్చి ఆదుకొనుము
శరను కామేశ్వరీ నీదు చరణ యుగళి
కొలచిన కొలది భక్తుల గోడు వినుచు
అవని కులదైవతంబుగా నాదుకొనుచు
తలచినంతనే వడి వడి దర్శనంబు
ఇచ్చు కామేశ్వరీ దేవి కెవరు సాటి
తలచువారికి లభియించు తలచి నంత
పిలుచు వారికి పలుకును పిలచినంత
కొలుచు వారికి బంగారు కొంగు నిండ
ఇచ్చు కామేశ్వరీ దేవి కెవరు సాటి
మనసు నీమూర్తి పై నిల్పు మాన వులను
ఎల్లవేళల గాచు నిన్నేమనందు?
కలిని భక్తుల పాలిట కామధేను
విలను కామేశ్వరీ దేవి కలదు మనకు
యుగ యుగాలనుండి ధరిత్రి యోగులంత
సేవ జేయుచు తరియించు సేవ కతన
అమ్మ యోగీశ్వరేశ్వరీ యనుట పాడి
కరుణ కామేశ్వరీ మమ్ము కావరావె!
కులము గోత్రము లన్నియు కలయ గలిపి
విశ్వ మానవ కల్యాణ వీక్షణమున
జగతి గాచెడు జగదేక జననివీవె
శరణు కామేశ్వరీ నీదు చరణ యుగళి
కనుల నిను గాంచ కమ్మని యనుభవమ్ము
మంత్ర జపముతో వర్దిల్లు మదిని శాంతి
మహిని కామితమ్ముల నిచ్చి మహిమ చూపు
జనని కామేశ్వరీ ఏలు కొనవె మమ్ము
వైభవోపేత వైకుంఠ వాసుదేవు
సోదరివి నీదు ప్రేమతో సోమనాధు
నర్ధ దేహమ్ము దాల్చిన హైమవతివి
ధరను కామేశ్వరివి నిన్ను దగ భజింతు
నీవు కారుణ్య వారాశి నేను చిన్న
బిందు సదృశుడ నెటులైన సింధుజేరి
కలియ నారాట పడుచుండ కావరావ
శరణు కామేశ్వరీ దివ్య చరణ యుగళి
విన్నవించిన పలుమార్లు మిన్న కుండి
ఆలకించితి వొకనాటి అర్ధరాత్రి
స్వప్న దర్శన భాగ్య ప్రసాద మిచ్చి
కాచినట్టి కామేశ్వరీ! ఘనత నీదె
చేరి శరణంటి పదమంటి చేదుకొనుము
ఇలను కలికంటి దేవంటి కలను గంటి
నీదు మహిమంటి నీతోడ నెయ్యమంటి
కరుణ కామేశ్వరీ నన్ను కను మొకంట
వెల్లువంటి హృదయ మందు వేదనంటి
కంటి రమనీయ శుభగాత్రి కలువకంటి
చేరి కూర్చుంటి వొకచేత చెఱకు పట్టి
కనుము కామేశ్వరీ! ఒక కంట మమ్ము
అల్పుడను జ్ఞాన హీనుండ నర్భ కుడను
నిన్ను ధ్యానించి సేవించు చున్నవాడ
జాలి మన్నించి దీవించు జాగదేల?
శరణు కామేశ్వరీ నీదు చరన యుగళి
అల్ప జీవిని, నీవఖిలాండ కోటి
దండ నాయికవు నను నీ యండ జేర్చి
ఇహ పర భాగ్యముల నింపు జేసి నన్ను
ఇష్ట కామేశ్వరీ దేవి ఏలు కొనవె
చెతు నీపాద సేవెట్లు చెప్పు మమ్మ
పిలిచి నంతనే పల్కు మావేల్పు టమ్మ
నిన్ను బొడగంటి కలలోన నెమ్మిగంటి
కలికి కామేశ్వరీ నీదు కరుణ వలన
భక్తి మార్గాల నతి సులభముగ నేను
కోరుకొంటి మార్జాల కిశోర నయము
నేర్పితివి మర్కట కిశోర నీతిసరళి
పట్టు కొంటి కామేశ్వరీ పదయుగమ్ము
నీవు దివ్య కాంతవు మరి నే నరుండ
నీదు మహిమల నరయంగ నేను ఎంత?
ఇహసుఖమ్ము చాలిక్కటు లింకచాలు
పరమ పదము కామేశ్వరీ త్వరగనీవె
కాన్తలేల? భ్రాంతులు కొల్పు కనకమేల?
మోహ మదిఏల నధికార దాహ మేల?
కోరి సంసారబంధనా గొలుసు లేల?
చేరి కామేశ్వరీ పాద సేవ కులకు
భక్తుడను దాసుడను సత్యవర్త నుడను
నిత్య సంధ్యాది జపములు నెఱపువాడ
సూర్యనారాయణ కవిని శ్రోత్రి యుడను
ఇష్ట కామేశ్వరీ నన్ను విడువ కమ్మ
నీదు నామమ్ము సాటి వేరేది లేదు
నీదు రూపమ్ము సాటి వేరేది లేదు
నీపద యుగమ్ము సాటి వేరేది లేదు
మహిని కామేశ్వరీ సాటి మాత గలదె!
నీదు నామజపము నాదు నిత్య పూజ
నీదు పద సేవ నాకిల నిత్య కర్మ
నిన్ను దర్శించు వాంఛయే నిత్య చింత
శరణు కామేశ్వరీ నీదు చరణ యుగళి
ఈశు నర్ధ దేహమ్ము గ్రహించి నీవు
అర్ద నారీశ్వరుండను ఖ్యాతి దెచ్చి
జగతి విఖ్యాతి గాంచిన జననివీవె
శరణు కామేశ్వరీ దివ్య చరణ యుగళి
పరమ పావనీ పార్వతీ బాలవీవె
అంబ అగజాత అన్నపూర్నమ్మ వీవె
కాళి కాత్యాయిని గిరిజ గౌరి వీవె
సర్వ మంగళ శ్యామలా శాంభవీవె
మహిని కామేశ్వరీ మాత మాకు నీవె
కనులు మూసిన నీరూపె మనసు నిండ
కనులు తెరచిన నీరూపె కనుల నిండ
పారవశ్యాన భక్తి పొంగార నిండ
సతము నీవె కామేశ్వరీ వ్రతము పండ
నీదు రూపమ్ము దర్శించు నేత్రములును
నామ సంకీర్తనలు జేయు నాలుకలును
అంకితమ్ముగా పూజించు హస్తములును
అరయ ఘనములు కామేశ్వరమ్మ జగతి
కామితములిచ్చు శివ శక్తి కామరూపి
వాంచితార్ధ ప్రదాయిని వామనయన
నీదు దర్శన భాగ్యమే నిత్య వాంచ
తీర్చగదవె కామేశ్వరీ దేవి కరుణ
నీదు చరణ మంజీరాల నాద లహరి
వీనులకు విందు మనసుకు వెన్నలగును
మాత నీ సేవ జేసెడి మాన వులకు
ముక్తి నొసగు కామేశ్వరీ భక్త వరద
చిందు రణగొణ ధ్వనులే వందనట్టి
శుక పికాదులు చరియించు సుందరవన
మందు కిలకిలారావాలు విందు జేయు
చోటు కామేశ్వరి దేవి చుపు మమ్మ
సకల విద్యాప్రదాతవు శారదాంబ
సిరుల నిచ్చేటి శ్రీలక్ష్మి సింధు పుత్రి
కల్కి మీనాక్షి కామాక్షి కాళికాంబ
విశ్వ కులదేవతనగ కామేశ్వరీవె
స్వీకరించి నా ప్రణతులు వేనవేలు
ఆలకించి నాప్రార్ధన లాదరమున
అనుమతించి నాజపతపంబినుమడింప
చేదు కొనుము కామేశ్వరీ శీఘ్ర గతిని
ఉదయ సంధ్య శుకపికా స్వరోన్నతముగ
ద్యుమణి తరుశాఖ కెంజాయ ద్యోత కముగ
వాగునీటి గల గలారవాల మధ్య
తపసు మిన్న కామేశ్వరీ ధాత్రి యందు
కులుకు చిలుకల కొలికిరో కలికివీవు
పలుకు తేనెల మంజుల వాణి వీవు
భాగ్య సౌభాగ్య ధాత్రిరో భగవ తీవు
అవని పాలించు కామేశ్వరమ్మ వీవు
కోరనణి మాది సిద్ధులు కోట్లసిరులు
కోర నతి పెద్ద భవనాలు ఊరు వాడ
కూడు, గుడ్డయు, గ్రుహమును కోరు కొందు
నిమ్ము నీయందు భక్తి కామేశ్వరమ్మ
మకుట మణిరత్న దేదీప్య మానమైన
వెలుగు నల్దిశ లందునా వెల్లి విరియ
చాప పుండ్రేక్షు బాణ పాశాంకుశాలు
హస్తముల దాల్చి చిరుదరహాస మొలుక
చంద్రచూడ కామేశ్వరీ చారుశీల
చిందు దరహాస చంద్రికల్ సుందరాంగి
చిలుకు తేనెలు నీదివ్య పలుకులందు
నీదు శుభ దర్శనంబనునిత్య మొసగ
వేడుకొందు కామేశ్వరీ విశ్వ జనని
గర్వితుల వినీతుల చేయ గల్గు చెలిమి
మార్చి నాస్తికులను భక్తి మతుల చేసి
దురితముల బాపు రమణీ! యతులిత చెలిమి
కోరు కొందు కామేశ్వరీ కుర్మి నెపుడు
కవివి నీవె వ్రాసిన పద్య కవిత వీవె
కల్పనయు నీదె భావ సంకలన మీదె
పంత మీదె వ్రాయంగ నాబలము నీవె
సర్వమీవె కామేశ్వరీ శ్యామలాంబ
కలమునీదె పట్టిన నాదు కరము నీదె
అందుగల నక్షరముల కూర్పంద మీదె
పదము లీవె పదములభావమ్ము నీవె
నాదియనగ కామేశ్వరిందేది గలదు?
పలికి తప్పని తల్లి మా పాలవెల్లి
మరకత శ్యామ మాతంగి మంజువాణి
పల్లవాధరి అలివేణి పంకజాక్షి
సిరులనిచ్చు కామేశ్వరీ సిద్ధ మాత
ధూప దీప నైవేద్యాది వ్యాపకముల
భక్తి నర్చించి పూజించి శక్తి కొలది
భక్ష్య భోజ్య ఫలమ్ములు పాయసాన్న
మర్పణము సేతు కామేశ్వరమ్మ కెపుడు
వనధులు, గిరుల్ఝరులు నదీ వనము లందు
చేతనా చేతనా స్థితి చిత్త మందు
నిన్ను సేవించు భక్తులు మిన్న వారె
పుణ్య తములు కామేశ్వరీ పుడమి యందు
చాప పాశాంకుశా పుష్ప శర చయమ్ము
హస్తముల నాల్గు పట్టితి వభయ హస్త
మెందు కనరాదు ననుబ్రోవ నిందు వదన
నీదు పాదలె శరనంటి నాదుకొనుము
చిన్త బాపంగ నీకేల పంత మమ్మ
దీనుడను తల్లి మరినీవె దిక్కు నాకు
చెలగ దీవించ కరమొండు వలయు నేమి
నీదు జూపె కామేశ్వరీ నిఖిల శక్తి
మేరుగిరిశృంగ గృహమధ్య మించుబొని
పంచబ్రహ్మాసనాసీన బాలత్రిపుర
సుందరీ తొగచెలిధారి వందితాంగి
విశ్వరూపి కమెశ్వరీ వేద వినుత
హిమశిఖరభూష కబరీభరమది విరియ
అంబురుహ నేత్రయుగ పంకజాస్యమలర
ఫాలతిలకమ్ము దయభాను పగిదినొప్ప
దంత సితపంక్తి బింభోష్టి తళుకు శ్రీహి
మాద్రితనయె కామేశ్వరిమ్మహిచెలంగ
వేల్పులకు తాత మనతాత వేల్పుచూడ
తాత వేల్పుకు తాతయు తాతతాత
మాత తాతతాతకు జగన్మాతయనగ
మహికి త్రాత కామేశ్వరీ మాత గొలుతు
నన్దనమునీదు కెళివన్నమ్ము సూవె
అబ్దిమెఖల భడ్రాసనమ్ము నీకు
అనిమిశులు సెవకులు శిరి ఆగ్య్నపాలి
స్రిమహారగ్ని కమెస్వరీవెనమ్మ
వాగధీశ్వరీ శంకర వామ భాగ
తరుణి తాపసారాధ్య కాదంబరనగ
సిధ్ధ శ్రీచక్ర వాసిని చిద్విలాస
అనగ కామేశ్వరీ దేవి అష్ట మూర్తి
రత్న మకుటా వతంసవు రాణి వీవు
స్వర్ణ కంకణా వరవీణ పాణి వీవు
మధుర గాన వినోది కౌమారి వీవు
చంద్ర చూడ కామేశ్వరీ చతుర వీవు
మత్త హంసా వధూటి గమన సదృశవు
పంచ ప్రణవాది మంత్ర రూపమ్ము తోడ
శుధ్ధ పంచ దశాక్షరీ బధ్ధ వీవు
మహిని కామేశ్వరీ దివ్య మాత వీవు
చండ ముండ శుంభ నిశుంభ భండ రాక్ష
సాధముల ద్రుంచి భువనాల శాంతి నిలిపి
భక్త పూజలందు భువనేశ్వరివి నీవె
శక్తి రూపి కామేశ్వరీ శరణు శరణు
నీదయ శిరి సంపద శాంతి నెగడు చుండు
నీదయ నశక్తులకు శక్తి నేర్పుకలుగు
నీదయ సుకవి హృదయాల నిద్ర లేపు
నీదు దయలున్న కామేశ్వరేది లోటు
చతుర వాగ్విలాసిని వాక్కు సంపదిచ్చు
సుదతి సుకుమారి ధరదివ్య సుఖము నిచ్చు
భవతి శార్వాణి సురసుధా పాన మిచ్చు
సుభద గాత్రి సువాసిని శుభమునిచ్చు
అవని కామేశ్వరీ దేవి అభయమిచ్చు
కారణంబు లేకయె కాలు కదుప లేము
మాయ నెరిగి మసలు కొను మర్మ సార
మెటుల తెలియ గలరు భువి నెవ్వరైన
కలిని కామేశ్వరీ నీదు కరుణ లేక
శాంతి సౌఖ్యము జగతిని భ్రాంతి నేడు
చెలగి సిరి సంపదలు చేరి చిన్త హెచ్చు
చేరి నీపాద భక్తు లెవ్వార లైన
పొన్దు ముక్తి కామేశ్వరీ పుడమి యన్దు
IV.శతక పద్యాలు -- సూక్తి
దార సుతులును గృహమును ధరను కలిగి
సార మించుక లేని సంసార మైన
సాధకుల కవశ్యము ముక్తి సాధ్యపడును
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
ధర్మ మనుకంప శాంతియు దాన గుణము
కల్గి యున్నను అరులారు కంటకములు
ముక్తి కడ్డంకి తొలగించి మోక్షమిచ్చు
కలిని కామేశ్వరీ దేవి కల్ప తరువు
ధరను మానవజన్మ ఉత్తమము గాన
జన్మ సాఫల్యతకు గాను సాధ్య మైన
మంచి పనులను చేయుడు కొంచె మైన
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
సాధు సజ్జన మైత్రితో సంక్ర మించు
భక్తి మార్గమ్ము నందు నీ శక్తి కొలది
ధ్యాన సాధన సేయ నజ్ఞాన మొదులు
వినుము కామేశ్వరీ దెవి విహిత వాక్కు
రక్తి అనురక్తి మునిగిన భక్తి భావ
మెటుల జనియించు సంగతి నెరుగు మిటుల
భగవదాశ్రయ మొందుటే భక్తి యనగ
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
దార, ధనము పదవియు నపారతెలివి
తేటలును వెంట రావన్న మాట నిజము
కలదు ధర్మమార్గంబొండు తెలియుమన్న
ఘనత కామెశ్వరీ యనుగ్రహము నీకు
అర్థ కామంబు ధర్మంబు నాచరించి
మోక్ష కాములైనట్టి ముముక్షువులకు
నిల్చుదైవంబు తోడుగా నిశ్చయంబు
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
నీతి తప్పక చెరియించు నిష్ఠపరుడు
దీనులకునండగ నిల్చు మనవుండు
అర్హుడగు దేవి కరునా కటాక్షములకు
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
ఘనముగ్రహణము పరికింప మానవులకు
అస్తిరముల విక్రిందుమీదగుచునుండు
ఎత్తుపల్లాలు మార్గమందెట్టులటుల
వినుము కామెశ్వరీ దెవి విహిత వాక్కు
దార, ధనమును, సుతుల నాదరము సేయ
చాల దుర్ధ్వగతికి, భక్తి సతము వలయు
పరగ పరమాత్మ నరయంగ సురలకైన
వినుము కామేశ్వరిదేవి విహిత వాక్కు
భక్తి దేవుని ప్రేరణా శక్తి గాని
భక్తుడు నిమిత్త మాత్రుండు వాని యందు
భక్తి చిగురింప నిగ్రహ శక్తి నిచ్చి
గాచు ననుట కామేశ్వరీ కలికి వాక్కు
ఊర్వి చర్విత చర్వణంబొందు నరుడు
ఘనత నర జన్మ మెత్తి విఘాత మేల
సాధనము సేయ సద్గతి సాధ్యపడును
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
పాప పుణ్య ధర్మాధర్మ వ్యాపకములు
సర్వ సాధారణ మిల నాచరణ మెరిగి
భక్తి పూజ సేయగ నీకు ముక్తి కలుగు
ననెడు కామేశ్వరీ వాక్కనన్య తులిత
కడగి పాపాలు పోవ గంగాదు లందు
నరులు మున్కలు వేయ నెన్నడును పోవు
ముందు మదిని పశ్చాత్తాప మొందకున్న
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
సేవలందున బితరుల సేవ మిన్న
వ్రాతలందున విధివ్రాత బరగు మిన్న
కాంతలందున కులకాంత కనగ మిన్న
దైవతంబుల కుల దైవతంబు మిన్న
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
ఇలను కుల దైవతంబును గొలుచు నట్టి
నరులిహ పర సుఖమ్ముల వరము లంది
జీవితము సాగును నూతన చిగురు దొడిగి
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
దేవతలకు నింద్రుండగు దేవరాజు
రాజులందు శ్రీరాముడు రాజ రాజు
భక్తులందున హనుమయె భక్తి రాజు
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
రసములందున శృంగార రసము రాజు
రాగములయందు కల్యాణి రాగ మలరు
సాధనల లోన భక్తికి సాటి లేదు
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
చదువు సంధ్యలు పుస్తక జ్ఞాన మదియు
నరయ కొరగావు పరమాత్మ నెరుగు టకును
భక్తి మార్గ మొక్కటె విధి యుక్త మగును
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
సరస కవి గాను రసఝరీ జాళువార
పండితుడ గాను భాషలో పటిమ జూప
సగటు కవి నేను వాడితి సరళ మైన
పదము లవియ కామేశ్వరీ భక్తి కొలిచి
మధుర మంజుల భాషణే మండనంబు
విద్య వినయంబు సదనాన హృద్యమంబు
నెగడు సిరి సంపదల తోడ నీగృహంబు
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
ఇలను నరజన్మ ఉత్తమం బెట్టు లనగ
అనిమిషులు సైత మీ భువి నవత రించి
ఆచరించిరి జపతపా ద్యాగ ములను
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
దేవి కొలుచుట కెన్నియో తెరువు లున్న
ముంత చలువగు నామె కత్యంత ప్రీతి
సులభ సాధ్యమ్ము సంకల్ప బలము కలుగు
నిష్ట కామేశ్వరీ మాత నింపు గొలువ
ధర్మ మార్గమ్ము నడువగా ధాత్రి యందు
నాడు చెప్పిరి పెద్దలు నేడు గూడ
అనుభవజ్ఞుల మాటలు వినుట పాడి
కలిని కామేశ్వరీ మాత కరుణ కలుగ
సంపదించు కైన ఘనము శాంతి కలుగ
గొప్ప సిరి మూట చింతల కుప్ప నేడు
పాటు పడనేల దైవంపు బాట నడుము
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
నీతి బాయక గడియించు నీదు ధనము
ధర్మ మార్గాన వెచ్చించి దార సుతుల
తోడ సుఖియించు నరునికి తోడు దైవ
మిలను కామేశ్వరీ దేవి కలికి వాక్కు
బంధ మనురాగ మది సతీ పతుల మధ్య
వరలు శాంతియు సంపదా వంశ వృధ్ధి
కలత లే లేని గృహము నాకమ్ము గాదె
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
తపస్సు కృతయుగంబునకు త్రేతా యుగాన
జ్ఞాన సిధ్ధియు యజ్ఞ యాగాదు లొప్పు
ద్వాపరకు నామ ధ్యాన మొప్పారు కలిని
వినుము కామేశ్వరీ దేవి విహిత వాక్కు
యంత్రముల మాత్రమే నమ్మి మంత్ర ములను
వీడిన పరిస్థితియె మరి నేడు కలదు
మంత్ర మహిమంబు తోడైన మానవులకు
నిత్య జయము కామేశ్వరీ నీదు కరుణ
V.సతక పద్యాలు -- జ్యోతిశ పరమైన దేవి స్తుతి
సోమసుతు నుచ్చరాసి దా భమ కైదు
పదము లారు రమ్ములతోడ కుదురు నేడు
కన్ను లర్క రాసి నడుము మున్ను నవమ
వాహను దSఆర్ధి కివె నమో వాక్కు లిడుదు
టీక:- సోమ సుతు నుచ్చ రాSఇ = కన్య(దేవి) ఆమెకు (కన్య రాSఇకి) 5 పాదములు(మకరముల బోలు పాదములు), 6 ఉరమ్ములు=కుచ కుమ్భములు, 7 కన్నులు అనగా మీన నయనాలు, 12 మద్య=సిమ్హము నడుము వన్టి నడుము, 9 వాహనుడు= వ్రుశభ వాహనుడు, Sఇవుడు; దSఆర్ది=
(పది మిథునమ్) నాథునిగా కోరు కున్నట్టి (పార్వతి) దేవి కి నమస్కరిస్తున్నను.
ఊదధి మేఖల సుతునికి నుచ్చరాSఇ
పదము లొప్పరు జననికి ప్రణుతి జేతు
పాద మన్జీర కిన్కిణీ నాద లహరి
తేలి కామేSwఅరీ సన్నుతిన్తు నిన్ను
టీక:-- ఉదధి మేఖల సుతుడు= భూసుతుడు =అన్గారకుని ఉచ్చరాSఇ=మకరమ్( మకరమ్ వన్టి పాదాలు గల దేవి పాద చిరు మువ్వల Sఅబ్ద లహరి తేలి కీర్తిన్చెదనని భావమ్.
ఖగసుతు ట్ర్హికోణరాశి ని కాశమైన
కుచములొప్పారు జగదమ్బ కూర్మిగొలుతు
అసురగురు నుcచరాశి సమానమైన
కన్నులొప్పు కామేశ్wఅరీ సన్నుతిన్తు
టీక:- ఖగ సుతుడు= శని (యొక్క) మూలత్రికోన రాశి=కుమ్భమ్ (కుచ కుమ్భములు) అట్టి సమ్పద గల జగదమ్బను, అట్లే అసురగురు=శుక్రు ని ఉచ్చ రాశి = మీనమ్, మీన నేత్రి యగు కామేశ్wఅరిని కీర్తిన్చెదనని భావమ్.
కర్క రాశి నథుని పోలు కన్తు లీను
మోము కల ముగ్ధ సుకుమారి మొగి భజిన్తు
లలిత లాస్యవి లలితాన్గి కలువ కన్టి
నిలను కామేశ్wఅరీ దేవి నిమ్పు గొలుతు
టీక:- కర్క రాశి నాతుడు= చన్ద్రుని పోలు కాన్తి వన్తమైన, సున్దర ముఖము గల దేవిని, అట్లే సుకుమారి, సున్దర నాట్యము సేయు కలువ కన్నులు గల కామేశ్wఅరిని గొలుతు నని భవము.
ఈనుని రాసి వహనమైన ఇన్డు ముఖిని
ఇన్డునుచ రాస గు వహనెన్డు దరుని
అర్డ డెహమ్ము డల్చిన యబ్జ నెట్రి
దరను కమెస్wఅరి డెవి డగ భజిన్టు
టిక:-ఇనుని రసి వహనమ్=సిమ్హవహనమ్ గల డెవి, చన్డ్ర ముఖిని, ఇన్డునుచరసి=వ్రుశభమ్ వహనము గ గల సివుని (నెలవన్క దరిన్చువడు) అతి సివుని అర్ద డెహి, కమెస్wఅరి ని భజిన్టునని భవము
డినకరు స్wఅరసి నడుమడె త్లు నతి
నెన్నడు ముకల ట న్వన్గి నె రి భజిన్టు
రట్న ఖచిట మెఖల డల్చి రమ్య మైన
మాట్ కమెస్wఅరికి భక్టిమల వెటు
తిక:- డినకరు స్wఅరాసి యనగా సుర్య రాసి=సిమ్హమ్; అతి నడుము కల సున్డరి(డెవిని), రట్నములు టపినబన్గరువడ్డనము దరిన్చినతి మాట మెడను భక్తి యనుమలటొ నలన్కరిన్టు నని భవమ్
VI.శతక పద్యాలు -- వ్రత నియమాలు/కొలుచు విధానము
అక్క లేడ్గురు ముత్తైదు లటను చేరి
మువ్వురుండగ వలయు నో పోతరాజు
కూడి కమేశ్వరీ దేవి కొలువ వలయు
వ్రతములను వ్రత రాజమై, బరగు నిదియు
ఆది, గురు వార ములయందు నమ్మ వ్రతము
చేయదగు నిష్ఠ నియమాల బాయ కుండ
చెప్పి తొలిరోజు రాత్రియే సిద్ధ పరుచ
వలెను కామేశ్వరి యనుజ్ఞ వనిత లపుడు
స్నాన మభ్యంగనము చేసి నాటి ప్రొద్దు
నలరు పట్టు పుట్టములతో నతివ లంత
చేరి ఆతిధ్య గృహమందు చెన్ను మీర
భక్తి కొలువ కామేశ్వరి వరము లిచ్చు
అక్క లందరు నొక పంక్తి చక్క జేరి
కూర్చొనగ వాయినంబిచ్చి కూర్మితోడ
వారి నడిగి ప్రసాదంబు పట్టి యొడిని
దీవెనల నంది కామేశ్వ రీవె యనుచు
ఫలము లన్నియు వండిన వంట లవియు
షడ్ర సోపేత భక్ష్య భోజ్యమ్ము లవియు
అమ్మ కర్పించి తత్ప్రసాదమ్ము స్వీక
రింప కామేశ్వరీ మాత కింపు యగును
పోతరాజుకు పంక్తి లో భోజనమును
పెట్టి తాంబూల దక్షిణ ప్రీతి నిచ్చి
అనుప వ్రత విధాన మనుచు నరయ వలయు
నిలను కామేశ్వరీ మాత నింపు గొలువ
VII.కొలుచు విధానము
రజత పళ్లెర మందు క్షీరంబు పోసి
కాంచ నాభరణము పట్టి కలుపు చుండి
అమ్మ కామేశ్వరీ యరుదైన పాట
భక్తి వినగను కొలిచెడి వారలకును
పాటలో మహత్తు కలిసి పాల కొలను
పారవశ్యము తోడ నా భక్తులంత
తన్మయంబున చెలగు చిత్తముల తోడ
కలిని కామేశ్వరీ యనుగ్రహము పొందు
VIII.శతక పద్యాలు -- ముగింపు
నీ దయ రచించి శతకమ్ము నేడు నేను
పఠిత జనులకు శుభము లాభమ్ము కలుగు
నట్లను గ్రహించు మనుచు నాదరముగ
వేడు కొందు కామేశ్వరీ విశ్వ మాత
భక్తి శతకమ్ము పఠియించ శక్తి కొలది
దిన దినము వార మందొక్క దినము నైన
నెగడు శాంతియు సిరులును నేటి జగతి
అమ్మ కామేశ్వరి యనుగ్రహమ్ము వలన
IX.శతక పద్యాలు -- మంగళాచరణమ్
జయ మతంగ తనయ నీకు జయము జయము
జయ కదంబ వన విహారి జయము నీకు
జయ శుక ప్రియ సంగీత ప్రియకు జయము
జయము కామేశ్వరీ నిత్య జయము నీకు
జయము త్ర్యక్షరీ బ్రహ్మాండ జనని జయము
ఆది మధ్యాంత రహిత కభేద మతికి
జయము చక్రాబ్జ నిలయకు శైల సుతకు
జయము కామేశ్వరీ నిత్య జయము నీకు
జయము శంభు రాణికి మాత శాంభవికిని
జయము మోహినీ శ్రీలక్ష్మి చారు మతికి
జయము చారు వీణా ధరీ శార దకును
జయము కామేశ్వరీ నిత్య జయము నీకు
మంగళము నపర్ణకు జయ మంగ ళమ్ము
రాజిత మణి కిరీటాప రాజి తకును
మంగళమ్ము దేవికి సర్వ మంగ ళకును
మాత కామేశ్వరికి నిత్య మంగళమ్ము