అధ్యాయం - 6
||సీ.|| సర్పదష్తుండగు శ్యామానుగాచి నీ
స్నేహ ధర్మంబును నిర్వహించి
ధునియందు చెయి పెట్టి దూరానయున్నట్టి
కమ్మరి బిడ్డనుంగాచినావు
పగలు వసంతోత్సవైభవంబును జూపి
చందనోత్సవమును జరిపి రాత్రి
మతసామరస్యంబు మహియందు నెలకొల్పి
మానవతను జాటి మనుషులందు
||ఆ.వె.|| కలిసియున్న చాలు కల్గును భాగ్యాలు
మంచియున్న చోట మాయలేదు
దైవ శక్తియున్న దయ్యంబు దరి రాదు
సకల సుగుణ శీలి సాయిరామ ||17||