అధ్యాయం - 11

||సీ.|| మునునొక్క దిన సంధ్య పెనుగాలి వీచెను

కుంభవృష్టియు నేల కురిసె షిరిడి

ప్రళయ సదృశమైన ప్రకృతివైనము జూచి

శరణు జొచ్చిరివారు సాయి చెంత

మనసు కరగి సాయి మన్నించి విన్నపం

శాసించి వరుణుని శాంత పరచె

గాలి వీచుట మానె వాలుగా వర్షంబు

కూడ తగ్గె జనులు కోరినటుల


||గీ.|| షిరిడి వెలసిన దేవతల్ వెరసి చూడ

కావగా లేకయున్ననూ కరుణతోడ

సాయి ఒక్కడే రక్షించె సకల జనుల

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||23||


అధ్యాయం - 12