అధ్యాయం - 29

||సీ.|| భజన సమాజంబు బయలు దేరెను గాశి

యాత్రకై మార్గ మధ్యంబు నందు

కోపరుగాంచెంత కుదురుగా శిర్డియ

నంప్ గ్రామంబు కలదందు గలడు సాయి

యను గొప్ప యోగీశు డత్యంతుదార స్వ

భావుండు తమకిచ్చు ద్రవ్యమనుచు

పేరాశతో చేరి శిర్డి బాబా ముందు

తమ విద్య జూపించి ధన్యులైరి

||ఆ.వె.|| బాబ యందు భక్తి భావంబు కల యజ

మానురాలు యాశ లేని దగుట

ప్రీతి నిచ్చె బాబ శ్రీరామ దర్శనం

సకల సుగుణ శీలి సాయి రామ||62||


||సీ.|| తాదర్శనము సేసినదియంత వివరించ

భర్తకు యది వట్టి భ్రమగ తోచి

యాక్షేపణలు సేయ నామె యూరక నుండె

బాబ స్వప్నమునందు భర్త కపుడు

వింత దృశ్యము జూప గత జన్మ పాపాలు

దహియించు మని వేడె దైన్యముగను

యున్నదా విశ్వాసమున యున్న దన గానె

బంధ ముక్తుని జేసి బాబ యతని

||ఆ.వె.|| కోర్కె నెరిగి యపుడు గురు రామదాసుని

దర్శనంబు నీయ ధన్యుడపుడు

బాబ పాదములను భక్తితో పూజించె

సకల సుగుణ శీలి సాయి రామ ||63||


||సీ.|| స్వప్నదృశ్యంబుల న్మనసు మార్చి యతని

సంశయ వైఖరి సాస్వతముగ

తొలగించి పేరాశ తుదకు భక్తిని బెంచె

తానిచ్చెను మిఠాయి కొనియు రెండు

రూప్యములదిగాక రూపాయ లొక రెండు

నగదిచ్చి దీవించి సాగనంపె

కాశి యాత్రను దారి కష్టమన్నది లేదు

భజన వల్ల ధనలాభమ్ము కలిగె

||ఆ.వె.|| సంతసమున వారు సాయి నాథు మహిమ

పొగడు కొనిరి దారి పొడుగు నెల్ల

వారి యాత్ర విజయ పథము నందుండగా

సకల సుగుణ శీలి సాయి రామ ||64||


||సీ.|| నన్ను మరచితివా! యనవిని కొప్పెను

పిల్లబ్రతుకుటెట్లు తల్లి మరచి

యని వేగ తొటలో నానపకాయతో

చేసి సీదాతోడ చేర్చి దక్షి

భు జేతికిచ్చి మేల్కొని హాటె మదినిశ్చ

యించెను పంపగా నివి శిరిడికి

కొలదినాళ్లకు హాటె గ్వాలియరుకు పోయె

పంపె ఏదియు రెండు రూప్యములను

||ఆ.వె.|| చేసి సీద బాబ చేతికివ్వను రెండు

రూప్యముల్ని గులుప దియను బాబ

దక్షిణయగు నంచు తగబల్కె మిత్రుతో

సకల సుగుణ శీలి సాయి రామ ||65||


||సీ.|| కూర్చు భక్తుడు పంపు కూర తినగ సాయి

వేచి యున్నడల్లె వేగ లేచి

ఇతర పదార్థముల్విడచి యానపకాయ

కూరనే దినినాడు కోర్కెదీర

యని మిత్రువల నెరిగిన యంత నత్యంత

సంతసించిన హాటె వింత కోర్కె

మదిని బాబా తాకిమరి యిచ్చు నాణెమ్ము

నాశించి మిత్రు తో నంపె శిరిడి

||ఆ.వె.|| నాణెము నెగురేసి నవ్వి దీవెజమాని

కిమ్మాని బలికి తను నిమ్మళముగ

నుండు మనుచు తిరిగి సూదితో నిచ్చెను

సకల సుగుణ శీలి సాయి రామ ||66||


||సీ.|| అచ్చరువొంద సీతారామ లక్ష్మణు

లోక ప్రక్క నాంజనేయుడును గలుగ

నింకొక ప్రక్క నార్వేకరీప్సితముగా

తాకి ఇవ్వక సాయి దఖలు పరిచె

నాణెంబు, తిరిగిమ్ము నార్వేకరునకని

శ్యామ జేప్పినగాని సాయి విభుడు

పాతిక రూప్యముల్పదిలంగ నిచ్చిన

ఈ రూప్యమును వానికివ్వుమనెను

||గీ.|| పాతికిచ్చినా గాని యావామనుండు

తిరిగి పొందని నాణెంబు తిరిగి మరల

సాయి కోశంబు జేరెను శ్యామతోడ

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||67||


అధ్యాయం - 30