అధ్యాయం - 13

||సీ.|| భీమాజి పాటీలు భీకరక్షయరోగ

బాధ బాపెని స్వప్నసాదృశముల

బాలషింపి వ్యాధి బాగయ్యె నల్లకు

క్కకు పెర్గుయన్నంబు కలిపిపెట్ట

బాపుసాహెబు బుట్టివమనవిరేచన

ల్చూపుడు వ్రేలితో నాపెనపుడు

చెవిపోటుకై శస్త్ర చికియిత్స చేయగా

నాళంది స్వామికి నయముగాక


||ఆ.వె.|| భక్తివేడ, సాయి, భగవంతుడే మేలు

చేయగలడు నీకు చింత వలదు

యనుట తడవు పోటు యవలీలగా తగ్గె

సకలసుగుణ శీలి సాయిరామ ||25||


అధ్యాయం - 14