Sir Humphry Davy(1st Baronet)-సర్ హంఫ్రీడేవి

Sir Humphry Davy(1st Baronet)-సర్ హంఫ్రీడేవి

సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ (ఇంగ్లండ్)లో రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు. పెంజన్స్ గ్రామర్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి 1793లో ట్రూరో వెళ్లాడు. 1798లో బ్రిష్టల్‌లోని

న్యూమేటిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరాడు. అక్కడ వాయువులపై ప్రయోగాలు చేశాడు. 1801లో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. 1804లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1810లో 'ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌' కి విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1820లో రాయల్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.

1807లో డేవిడ్ హంఫ్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి పొటాషియం తయారుచేశాడు. సోడియం హైడ్రాక్సైడ్ నుంచి సొడియంను వేరుచేశాడు. 1808లో కాల్షియం మూలకాన్ని కనుక్కొన్నాడు. మెగ్నీషియం, బోరాన్, బేరియం మూలకాలను కూడా గుర్తించాడు. బొగ్గు గనుల్లో ఉపయోగించే రక్షక దీపాన్ని కనుగొన్నాడు. 1810లో క్లోరిన్ వాయువుకి ఆ పేరును ప్రతిపాదించాడు.

చంద్రునిపై ఒక బిలానికి డేవీ పేరు పెట్టారు. నెపోలియన్ బోనా పార్టీ నుంచి ఒక పతకాన్ని పొందాడు. 1819లో హంఫ్రీ డేవీకి''సర్'' బిరుదు ఇచ్చి గౌరవించారు. 1829 మే 29న 50వ ఏట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మరణించాడు.

_____________________________________