Jacobus Henricus van 't Hoff Jr.-జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్

Jacobus Henricus van 't Hoff, Jr.,జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్

జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్ 1852 ఆగస్టు 30న నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జన్మించారు. తల్లిదండ్రులు హెన్రికస్ వాంట్‌హాఫ్ సీనియర్, కాఫ్‌ వాంట్‌హాఫ్. చదువు ప్రారంభించిన తొలినాళ్లలో కవిత్వం, వేదాంతం పట్ల ఆసక్తి ప్రదర్శించేవాడు. 1869లో డెప్ట్ విశ్వవిద్యాలయంలో చేరాడు. రసాయన సాంకేతిక నిపుణుడిగా పట్టా పొందాడు. 1874లో యుట్రెక్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు.

1874లో వాంట్‌హాఫ్ స్టియిరో కెమిస్ట్రీలో చేసిన పరిశోధనలను ప్రచురించాడు. 1884లో రసాయన గతిశాస్త్రంపై చేసిన పరిశోధనా వివరాలను ప్రచురించాడు.

వీటిలో రసాయన చర్యల క్రమాంకాన్ని (Order) నిర్ణయించడానికి కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఈ పద్ధతిలో గ్రాఫిక్స్, ఉష్ణగతి శాస్త్ర నియమాలను రసాయన చర్యల సమతాస్థితికి ఉపయోగించాడు. 1889లో అర్హీనియస్ సమీకరణానికి భౌతిక న్యాయాన్ని సమకూర్చాడు. 1896లో వాంట్‌హాఫ్‌ను బెర్లిన్‌లోని ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో రసాయన శాస్త్ర ఆచార్యుడిగా నియమించారు. వాంట్‌హాఫ్ 1893లో రాయల్ సొసైటీ నుంచి డేవి పతకాన్ని స్వీకరించాడు. ద్రావణాల మీద చేసిన ప్రయోగాలు, పరిశోధనలకు 1901లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. జర్మనీలోని బెర్లిన్‌లో 58వ ఏట 1911 మార్చి 1న మరణించారు.