Abu Abdullah Muhammad bin Musa al-Khwarizmi

ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి Abu Abdullah Muhammad bin Musa al-Khwarizmi

జననం c. 780

మరణం c. 850

అల్ క్వారిజిమి ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి, (ఆంగ్లం : Al-Khwarizmi (Mohammad ebne Mūsā Khwārazmī)) ఒక పర్షియన్ ఇస్లామీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ ఖగోళశాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ జ్యోతిష్యజ్ఞుడు మరియు ఇస్లామీయ భౌగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను దాదాపు క్రీ.శ. 780 లో క్వారిజిమ్ , అప్పటి పర్షియా ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఖివా ఉజ్బెకిస్తాన్ లో గలదు. ఇతను క్రీ.శ. 850 లో మరణించాడు. ఇతను బాగ్దాదు లోని 'విజ్ఞాన భవనము' హౌస్ ఆఫ్ విజ్‌డమ్ లో తన జీవితము పండితునిగా గడిపాడు.

ఇతని సేవలు

గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, భూగోళ శాస్త్రం మరియు కార్టోగ్రాఫీ మొదలగు శాస్త్రాలందు తన విజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఈతని సిద్ధాంతాలనాధారంగానే అల్ జీబ్రా, తికోణమితి మరియు ఇతర విజ్ఞాన శాస్త్రాలకు రహదారి ఏర్పడింది. ఇతనికి ఆల్-జీబ్రా పితామహునిగా ప్రపంచం గుర్తించింది. ఆల్-జీబ్రా అనే పదానికి మూలం అరబ్బీ భాష పదము 'అల్ జబ్ర్'. ఈ పదాన్ని ఇతను తన 830 క్రీ.శ. లో వ్రాసిన గ్రంధమైన అల్-కితాబ్ అల్-ముక్తసర్ ఫి హిసాబ్ అల్-జబ్ర్ వల్ ముకాబలా లేదా: "The Compendious Book on Calculation by Completion and Balancing". ఈ గ్రంధము యొక్క తర్జుమా 12వ శతాబ్దంలోనే లాటిన్ భాష లో జరిగినది.

అల్-కితాబ్ అల్-ముక్తసర్ ఫి హిసాబ్ అల్-జబ్ర్ వల్ ముకాబలా ఒక గణిత శాస్త్ర గ్రంధము. దాదాపు క్రీ.శ. 830 లో వ్రాయబడినది. ఇందిలో ఆల్ జీబ్రా విషయాలన్నీ క్రోడీకృతం అయి వున్నవి. ఈ శాస్త్ర జ్ఞానాన్ని ప్రపంచంలోని అన్ని విజ్ఞాన కేంద్రాలు అవలంబించాయి.