C.N.R.Rao

చింతామణి నాగేష రామచంద్ర రావు

సి.ఎన్.ఆర్.రావుగా ప్రసిద్ధిచెందిన చింతామణి నాగేష రామచంద్ర రావు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. ఈయన జూన్ 30, 1934న బెంగుళూరులో జన్మించాడు.

మైసూరు విశ్వ విద్యాలయంలో 1951లో డిగ్రీ చదివిన తరువాత కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువు పూర్తి చేసుకొని, 1958లో పుర్డ్యూ యూనివర్సిటీలో పి.హెచ్.డి. సాధించాడు. 1984-1994 మధ్య కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు డైరెక్టరుగా పని చేశాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. "జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చి" సంస్థను స్థాపించాడు. ఇంకా చాలా ఉన్నత పదవులు నిర్వహించాడు.

సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ మరియు మెటీరియల్ సైన్సు రంగాలలో సి.ఎన్. ఆర్. రావు శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యాడు. ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడుల గురించి అతని పరిశోధనలు ఆ రంగంలో ముఖ్యమైనవి.

ఇతనికి లభించిన కొన్ని అవార్డులు -

* 2000- హ్యూస్ మెడల్ - రాయల్ సొసైటీ

* 2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి

* .ఇంకా National Academy of Sciences, en:American Academy of Arts and Sciences, the Royal Society (London), French Academy, Japan Academy and the Pontifical Academy వారి అవార్డులు

* 2005 - Dan David Prize - Dan David Foundation, Tel Aviv University.

* 2005 - Chevalier de la Legion d'Honneur (Knight of the Legion of Honour) - ఫ్రాన్సు ప్రభుత్వంచే

* పద్మశ్రీ, పద్మ విభూషణ్

* 1968 - శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైజు