Christopher Colombus
1492 లో క్రిస్టఫర్ కొలంబస్ భారత్ కు సముద్రమార్గం కనుగొనబోయి అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. ఉత్సాహంగా తాను భారత్ చేరానని ప్రకటించుకున్నాడు. తర్వాత తెలిసింది అది మరో క్రొత్త ఖండమనీ. దాంతో స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్లనీ, దీవులకి పశ్చిమ ఇండియా దీవులనీ పేరు పెట్టారు. తాము దోచుకోవడానికి మరో విశాల భూఖండం దొరికింది కదాని యూరోపియన్లు తెగ సంబరపడ్డారు. అనంతర అమెరికా స్వాతంత్ర సమరం గురించి, వాషింగ్టన్ నాయకత్వం గురించీ అందరికీ తెలిసిందే.చరిత్ర పూర్వ హిమ యుగానికి ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతాన్ని అసియా ఖండంలోని సైబీరియాతో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెనగా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు.హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ భూమార్గ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1493, నవంబరు 19న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టోరికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది.అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది. ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు.క్రిస్టఫర్ కొలంబస్ 1492 అక్టోబరు 12 న క్యూబాను మొదటిసారిగా తన నౌకాయాత్రలో సందర్శించాడుBiography :
Born -- c.1451 ,Maybe Genoa, Liguria
Died 20 May 1506 (aged c. 55)
Valladolid, Castile
Nationality Disputed
Other names - Genoese: Christoffa Corombo ; Italian: Cristoforo Colombo
Occupation - Maritime explorer for the Crown of Castile
Title - Admiral of the Ocean Sea; Viceroy and Governor of the Indies
Religious beliefs - Roman Catholic
Spouse(s) - Filipa Moniz (c. 1476-1485)
Children - Diego,Fernando
Relatives - Giovanni Pellegrino, Giacomo and Bartolomeo Columbus (brothers)