Praphulla Chandra Ray

ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ (బెంగాలీ: প্রফুল্ল চন্দ্র রায়) బెంగాళీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు. ఈయన ఆగష్టు 2, 1861 న ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని ఖుల్నా జిల్లా, రరూలి-కాటిపారా గ్రామంలో జన్మించాడు. జూన్ 16, 1944 న మరణించాడు. భారతదేశంలోనే మొట్టమొదటిదైన ఫార్మషూటికల్ కంపెనీ, బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మషూటికల్స్ ను ప్రారంభించాడు. ప్రఫుల్ల చంద్ర రాయ్, భారతీయుల యొక్క విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసినారు. “Chemical Knowledge of the Hindus of Old” (Isis, Vol.2, No.2, pg. 322-325, The University of Chicago press) అనే వ్యాసం మనమందరం చూడదగినది. ఈ వ్యాసంలో ప్రఫుల్ల చంద్ర గారు మన భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెబుతారు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.