శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
ఎపిసోడ్ 02 - భాగం 02
(వీడియోలో ని|| 28.45 నుండి )
సిద్ధాశ్రమంలోని పని అయిపోయింది. నాయనా, కృతార్థుడనైనాను నేను, నా కోరిక తీరిందన్నారు విశ్వామిత్రులు. కాని మహర్షులవారి శిష్యులందరు చెప్పారు, "స్వామీ! అంతా బాగుంది. ఇప్పుడు మనం అబ్బాయిని తీసుకొని మిథిలా నగరం వెళితే బాగుంటుంది. [బీహార్ వారే మైథిలీ శరణ్ గుప్త. మిథిలానగరం బీహారులో ఉంది. బీహార్ చాల గొప్పదండి. మధ్యప్రదేశ్, బీహార్ మహా పవిత్రమైన స్థలాలు.] మిథిలకు వెళదామని చెప్పారు. బాబూ ధనుస్సు చూడవచ్చు నువ్వు. అక్కడ జనక మహారాజుగారు ఒక ప్రతిజ్ఞ చేసారు. య: సజ్యం ప్రకురుతే స ఏవ జనక జామాత| య: సజ్యం నకురుతే తస్యాపి జనకజా మాతా| ఎవరైతే శివ ధనుస్సును వంచేస్తారో, ఎక్కు పెడతారో వారు జనకునికి జామాత-అల్లుడవుతారు. ఎవరైతే ధనుస్సును ఎక్కు పెట్టలేక అసమర్థుడౌతాడో- తస్యాపి - వాడికి కూడా జనకజా మాతా జనకరాజ పుత్రిక సీతమ్మ తల్లి అవుతుంది ! ఇదొక ప్రతిజ్ఞ చేసారు.
పెళ్లి సమయానికి అమ్మ వారికి ఆరో ఏడు. రామచంద్రమూర్తివారికి 16వ ఏడు. పరమార్థం, భగవతం, భక్తిభావం, వేదాంతం అట్లా ఉంచండి, మనుష్యులకు వివాహంలో ఎంత వయోభేదం ఉండాలో కూడా రాముడు చూపించాడండి. ఐదు నుండి పది దాకా ఉండవచ్చు ఎడం. పది దాటితే unfit. ఐదు లోపల తప్పు, వరహీనం. అరణ్యవాసానికి బయల్దేరుతున్నప్పుడు నా భర్త రామచంద్రమూర్తి వారి వయసు పంచవింశక, పంచవింశ ఇరవై ఐదు, క అంటే మూడు, అంటే ఇరవై ఎనిమిది. నాకు అష్టాదశ, పద్ధెనిమిది. వివాహానంతరం అయోధ్యలో మా ఇద్దరి కాపరం పన్నెండు ఏళ్ళు - ద్వాదశ వర్షాణి. ఇరవై ఎనిమిదిలోంచి పన్నెండు మైనస్ చేస్తే - పదహారు ఏళ్ళు రాములవారు, పద్ధెనిమిదిలోనుంచి పన్నెండు పొతే ఆరు అమ్మవారి వయసు. కాబట్టి పెళ్లి సమయానికి అమ్మవారి వయసు ఆరు. ఆరేళ్ళ పిల్లకు పెళ్లేమిటండీ అన్నారు. బొమ్మల పెళ్లి లాంటి పెళ్లా? కాదు కాదు! పోనీ పెళ్లెలా చేశారంటే కాపరానికి కూడా తెచ్చుకున్నాడుగా! యజ్ఞార్థం భూమి దున్నుతున్నాడు. ఒక పెట్టె తగిలింది. అందులోనుండి అమ్మవారు లేచింది. దీని మీద కట్టుకథలు. వేదవతి భస్మమైతే ఆ భస్మం తీసి ఒక డబ్బాలో పెడితే ఆ డబ్బా సముద్రంలో పడేస్తే ఆ సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి మిథిలా నగరంలో ఉన్న పొలంలో వచ్చిందట. సముద్రం ఎక్కడ ఉంది? బీహార్ ఎక్కడ ఉంది? అక్కడికి ఇక్కడికి transport ఎలా? ఎగిరి వచ్చిందా? ఏరోప్లేన్ లో వచ్చిందా? కాకమ్మ కథలు కల్పించిన వాళ్ళకు బుర్ర లేదండి, పిట్ట కథలు. ఇది సినిమా కూడా తీశారు బ్రహ్మాండంగా. వేదవతే అమ్మవారిగా అవతరించిందని చెప్పటం కోసం ఇన్ని మార్గాలు పొందాల్సి వచ్చింది వాళ్లకు. భస్మంలేదు, పెట్టె లేదు.
జనకుడు దున్నుతున్నాడు, లోపలినుంచి లేచింది అమ్మ. ఎట్లా లేస్తుందన్నారు. అదే తమాషా! పరమాత్మకు అవతారాల్లో మాతాపితరుల దగ్గర కుమారులుగా పుట్టిన కండిషన్సు ఉన్నాయి, కానీ ప్రకృతి శక్తియైన జగన్మాతకు ఆవిర్భావ తిరోభావాలే కాని పుట్టుక లేదు. గుర్తుపెట్టుకోండి. సీతమ్మ భూమిలోనుంచి లేచింది. పుట్టిందా? పుట్టడమేమిటి?
పద్మావతీదేవి కార్తీకం. మొన్ననే బ్రహ్మోత్సవం అయింది. పంచమి తీర్థం అంటారు దాన్ని. మహోత్సవం చేస్తారు. తిరుచానూరులో కోనేరులో కమలం మీద దొరికింది. ద్రౌపది అగ్నిలోనుండి ఆవిర్భవించింది, వేదవతి వేదాధ్యయనం చేస్తుంటే ఆ ధ్వని నుండి ఉద్భవించింది. అంటే పృథ్వీ,అప్, తేజస్సు, వాయు, ఆకాశం ఈ ఐదు భూతాలలో ఒక్కొక్క భూతం/తత్త్వం నుండి ఆవిర్భవిస్తుంది జగన్మాత. పుట్టడం అంటే పంచభూతాలతో వచ్చే పాంచభౌతిక శరీరం, అది మనది. జగన్మాతకి పుట్టుక లేదు, ఆవిర్భావమే. అందుకే ప్రళయమూ లేదు, భూమిలో లయమే, అంతర్ధానమే. ఆవిర్భావ తిరోభావాలే ఆ జగన్మాత స్వరూపం కనుక ఆ తల్లి త్రేతాయాం జానకీ శక్తిః, ఆ శక్తి స్వరూపమే సీతగా అవతరించింది, పిల్లలా కనిపించింది. తీసుకొని వెళ్ళి పెద్ద భార్యకు ఇచ్చాడు, సుమేధ అని ఆమె పేరు. ఆయనకీ ముగ్గురు భార్యలున్నారు పాపం! సుమేధ అనే ఆవిడకు ఇచ్చాడు. పిల్లలు లేరుగా, పెంచుకుందాము అనుకున్నారు. ఆయన కొలువుకూటానికి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేసరికే పిల్ల పెద్దదయింది, పెళ్ళీడు పిల్లగా కనిపించింది. ఈ అమ్మాయి ఎవరు? అన్నాడు, పొద్దున మీరు ఇచ్చిన అమ్మాయే అన్నది ఆవిడ. అవునా? మహాశక్తి, జగన్మాత, పరాశక్తి, ఆ శక్తి స్వరూపం మన ఇంట్లో అవతరించింది, మనల్ని కృతార్థులను చేయడానికే అని గ్రహించాడు జనకుడు. ఇలాంటి జగన్మాతకు వరాన్వేషణ ఎలాంటి వాడిని చేయాలి? సాక్షాత్ శివోవా విష్ణుర్వా, ఆయనే రావాలి. ఆయన రావడానికి నేనెలాంటి ప్రయత్నం చేయాలి? వస్తాడో? రాడో? నేనెలాంటి ప్రయత్నం చేయాలి? అప్పుడు ఆలోచించాడు, తనకు ఆరు తరాల ముందు దేవరాతుడనే రాజు పరమభక్తితో శివార్చన చేసినపుడు శివుడు అనుగ్రహించి తన ధనుస్సును ఇచ్చి, నీ దగ్గర ఉంచుకో, పూజించుకో అని ఇచ్చాడు. ఎపుడు? దక్షయజ్ఞం తర్వాత. ఆ ధనుస్సును పూజిస్తున్నాడు, అది వచ్చి ఆరుతరాలు నడిచాయి. ఇంతవరకు ఆ ధనుస్సును ఎత్తగల్గినవాళ్ళు లేరు. దాని జోలికి ఎవ్వరూ పోరు. రెండు పుష్పాలు పెట్టి, గంధం వేసి దండం పెడుతున్నాడు. నిజంగా పరమేశ్వరుడే కనుక రావలసి వస్తే ఆయనకు ఈ ధనుస్సుతో పందెం పెడితే సరిపోతుంది, ఆయన సంగతి మనకు తెలిసిపోతుంది, అమ్మాయికి పెళ్ళి అయిపోతుందని, య: సజ్యం ప్రకురుతే స ఏవ జనక జామాత అని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. చాలామందే వచ్చారు పాపం, చూద్దామని. రావణాసురుడు కూడా వచ్చాడంటారు, ఏమో? అవన్ని తమాషా రామాయణాలు. రామాయణానికి పరమ ప్రామాణికం వాల్మీకి రామాయణమే, కనుక అందులో ఇక్కడ రావణ ప్రసక్తే లేదు.
ఇది స్వయంవరమా? కాదా? సీతమ్మ పెళ్ళి స్వయంవరం కాదు. సీతమ్మ పెళ్ళి స్వయంవరమైతే ఆమె వరించాలి, అటువంటి మాటల్లేవు ఇక్కడ. రామయ్యను సీత చూడలేదు, సీతమ్మను రామయ్య చూడలేదు. పెళ్ళిలో వధూవరులు చూసుకోకూడదు. చూస్తే నష్టమెవరికంటే, పిల్లవాడికే. కన్య యొక్క దృష్టి చాలా పవర్ ఫుల్ అట. తనకు రాబోయే సహధర్మచారుని చూసుకోడానికి చాలా కఠినంగా ఉంటుందట ఆమె దృష్టి. ఆ దృష్టితో కనక చూస్తే వీడు సగం బలహీనుడు అయిపోతాడట. కేవలం ప్రాజాపత్య వివాహమే ఇది. ఒకరిని ఒకరు ఎరుగరు. మానాన్నగారు ఏదో ఒక ప్రతిజ్ఞ పెట్టారు. ఆయన అనుకున్నది వీర్యశుల్కంగా పెట్టారు. అంతే.
అయితే క్షత్రియ కన్యలకు వరించి వివాహం చేసుకొనే హక్కు ఉంది. రుక్మిణి కళ్యాణమలాంటిది. ఆ కళ్యాణం రెండు భాగాల వివాహం, ఒకటి గాంధర్వం, మరొకటి రాక్షసం. రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్" రాక్షసవివాహంతో తీసుకెళ్ళవయ్యా, వస్తాను అన్నది. గాంధర్వం ఏమిటంటే ప్రేమలేఖ పంపించడం, విప్రుడితో రుక్మిణి సందేశమే ప్రేమలేఖ, సీతమ్మ పాపం ఇవి ఏవీ ఎరుగదు, శివధనుస్సు ఎక్కు పెట్టాడు, అంతే, ఎక్కు పెట్టినవాడికి ఇస్తా అన్నాడు.
రామ లక్ష్మణులను తీసుకొని బయల్దేరారు విశ్వామిత్రులు, ఋషిపరివారాలు వెంట వచ్చాయి. నదుల గురించి, గంగ దాని ఉత్పత్తి, సగర వంశం, సగరచరిత్ర, అనేక ఆఖ్యానాలు చెప్తున్నారు విశ్వామిత్రులు, ఆఖ్యానాలు చెప్పడం ఏమిటి? అంటే, నువ్వు పరమేశ్వరుడి దగ్గర నివేదించుకోవడం, నీకున్నది నివేదించుకోవడం, శుద్ధమౌతుందని, అంకితమవుతుందని, పరమేశ్వరార్పణ అవుతుందని. అనేక కథలు, ఆయన ఊ కొడ్తూ ఉండటం, ఈయన చెప్తూ ఉండటం, తాతయ్యగారు చెప్తున్న కొద్ది రామయ్య అడుగుతూనే ఉన్నాడు సందేహాలు. పాపం! చెప్పాలని ఉత్సాహంగా ఉంది ఆయనకు, ఇదేమిటండి? అదేమిటండి? అని కొంచం అడుగుదాం. ఇది అంగ దేశం. అహా! అంగ దేశం అంటే? బ్రహ్మహత్యా మహాపాపంతో బాధ పడుతున్న దేవేంద్రుణ్ణి మంత్రోదకంతో కడిగితే ఆ మలినపు నీళ్ళు పడ్డవి కనుక (1.24.17-32) మలద, కరూశ దేశాలయినాయి. ఇంద్రుడు వరం వల్ల ఆకలి, దప్పిక ఉండవు ఇక్కడ. ఇలా దేశాల, నదుల కథలు, అనేక ఆఖ్యాయికలు, భగీరథుడి చరిత్రలు అన్నీ చెప్పుకుంటూ ఒక్క చోటికి వచ్చేసరికల్లా పాడుపడ్డ ఆశ్రమం కనబడ్డది. ఆ ఆశ్రమంలో ఎవ్వరూ లేరు. అది అహల్యాశ్రమం.
న హల్యత ఇత్యహల్యా, ఎక్కడా ఏ లోపం లేనిది, బ్రహ్మగారు ఒక దివ్య సౌందర్యమూర్తిని సృష్టించారు. అంతటి దివ్య సౌందర్యమూర్తికి భర్త ఎవరా? అని ఆలోచించాడు. అఖండమైన, తీక్ష్ణమైన బ్రహ్మచర్య వ్రత నిష్ఠ కలిగిన, నిగ్రహం కలిగిన మహానుభావుడు కావాలని ఆలోచించగా గౌతముడు దొరికాడు ఆయనకు. ఆ గౌతముడి దగ్గర ఈ అహల్యను ఉంచాడు. అయ్యా!మీ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. అహల్యను అక్కడ ఉంచారు, కొన్ని సంవత్సరములు ఆయన దగ్గర ఉన్నది. ఆయన తొణకలేదు. ఇంద్రియ నిగ్రహంలో బలవత్తరమైన శక్తి కలవాడు. పరమ శివభక్తుడు. గంగలో ఒక భాగాన్ని భూలోకానికి దించిన వాడు, అదే గౌతమీ. గోదావరి పక్కన వరుసగా మంథెన, ధర్మపురి వైపుగా వెళ్తుంటే మీకు కనిపిస్తాయి, గౌతముడు ప్రతిష్ఠించిన శివలింగాలు, గౌతమేశ్వర లింగాలు, పరమ శివ భక్తుడు. బ్రహ్మగారు వచ్చారు, ఈమెకు తగినవాడివి నీవే అని వారిద్దరికి వివాహం చేసాడు.
అప్పటినుండి ఇంద్రుడు పగబట్టాడని, ఏవేవో కథలు, నిజాలు కావు. నైషాం శిశ్నం ప్రదహతి జాతవేదః, ఇంద్రాదులకు కామాదులు లేవండీ. ఏషాం దేవతానాం శిశ్నం న దహతి కామాగ్ని, స్పష్టంగా మంత్రవర్ణం చెబుతుంది. ఇంద్రుడు మోజుపడ్డాడని, వరించాడని, మోహపడ్డాడని అన్నీ కథలే. మరైతే అసలు సంగతి ఏమిటి? ఉంది, కథలో అర్థం ఉంది. గౌతముడి తపస్సు కొంత పాడు చేయాలి అనుకున్నాడు. మనం ఏ పని చేస్తూ ఉన్నా, ఏ పుణ్య కార్యం చేస్తున్నా దేవతలూ అడ్డం వస్తారు, రాక్షసులూ అడ్డం వస్తారు. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కుర్యాత్ ఘంటారావం, దేవతార్చనలో గంట ఎందుకు మోగిస్తారు? రాక్షసులు లేచిపోవాలి, అనుకూలమైన అనుగ్రహం కలిగించడానికి దేవతలు రావాలి, కాని దేవతలొస్తే పరీక్షిస్తూ ఉంటారు. వాళ్ళుకూడా వీలైనంతవరలు మన తపశ్చర్యను పాడు చేస్తూ ఉంటారు. రాక్షసులే విఘ్నం చేస్తారనుకోవద్దు, దేవతలు కూడా చేస్తారు.
ఈ గౌతముడి తపస్సు పెరిగిపోతుందని, దాన్ని పాడు చేయడానికి ఈ దేవేంద్రుడు ప్రత్యేక ప్రణాళిక పెట్టుకొని గౌతమ వేషంతో ఆశ్రమానికి వచ్చాడు.
అహల్య అంటే సామాన్యురాలు కాదు. మహా పతివ్రత. కాని ప్రారబ్ధ బలం. "దేవరాజ కుతూహలాత్," అన్నారు వాల్మీకి. దేవేంద్రుడు వచ్చాడని కనిపించింది. పతివ్రత కాకపోతే ఎలా కనబడుతుంది? వచ్చినవాడు దేవేంద్రుడని తెలిసినా కొంచం చపలత్వం కలిగింది. ఆ గౌతముడు వచ్చి శపించాడు, ఎవర్ని? ***ఇంద్రుణ్ణి. నూరు మచ్చలు శరీరం మీద వస్తాయి అన్నాడు. ఆమెను కూడా శపించాడు, ఆ శాపం ఎలాంటిది అంటే శాపంవంటి అనుగ్రహం. వేల సంవత్సరాలు ఇక్కడే ఏ భూతానికి కనబడకుండా పడిఉండు. ఆహారాదులు లేకుండా శిలాతుల్యంగా ఉండు. "రామమేకాగ్ర మనసా ధ్యాయన్తీ," ఆమెకు ఒక కోర్సు ఇచ్చారు, ఆ చాపల్యం యొక్క పాపం పోగొట్టడానికి నీవు శ్రీరాముణ్ణి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉండమన్నాడు. సంతత శ్రీరామ ధ్యానం చేత పాప ప్రక్షాళన జరుగుతుంది. యోగులకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది? మనం పది జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంటే, యోగి ఆ పది జన్మలను ఏక కాలంలో అనుభవించి ఆ ప్రారబ్ధం తీర్చుకోవచ్చు. కొన్ని ఫెసిలిటీస్, శరీరం పుడుతూ ఉంటుంది,ఈ శరీరానికి ఉన్న ప్రారబ్ధం వచ్చే శరీరానికి ఉండదుగా! తప్పు చేస్తే ఎలా పోతుంది? శరీరం మారితే పోతుంది. అన్ని తప్పులు అక్కడికి పోతాయి.
ఇలా ఏకాగ్రతతో తపస్సు చేస్తూ ఉంటే ఏ నాడు సగుణ, సాకార, కోమల, శ్యామల, మనోజ్ఞ, మధుర, మనోహర, లావణ్య దివ్యసౌందర్య దివ్యస్ఫూర్తి రామమూర్తి ఇక్కడకు వస్తారో నీకప్పుడు ఈ శాపం అంతా పోతుంది, అన్నారు. స్వామి అక్కడకు వచ్చారు. ఆ పాద కమల స్పర్శ చేత, మహత్తర శక్తి కలిగిన శ్రీరామ పాదమాయె, "రాముడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతోద్దాముఁడు రాముడే పరమదైవము మాకని మీ యడుగు గెందామరలే భజించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!" రామ అంటే చాలు సర్వ పాపాలు పోతాయి. "రా" కలుషంబులెల్ల బయలం బడ ద్రోచిన "మ" కవాటమై ఢీకొనిప్రోవుచు నిక్కమని ధీయుతులెన్నం తదీయ వర్ణముల్ గైకొని భక్తిచే నుడువంగానరు గాక విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల దాశరథీ!కరుణాపయోనిధీ!" సర్వ పాతకచ్ఛేదనశక్తి కలిగిన ప్రభువు కనుక స్వామి పాదారవిందాలు ఎప్పుడైతే ఆశ్రమంలో మోపారో తత్ క్షణమే సమస్త పాపాలు పోయినాయి. అమ్మకు దివ్య శక్తి, తేజస్సు వచ్చాయి, నమస్కరించింది, పూజించింది, ఎప్పుడైతే ఈమె పాప, శాప తాపాలు పోయినవో, హిమవత్పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న గౌతముడు యోగశక్తితో అక్కడకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ అర్చించారు. రామానుగ్రహం పొందారు.
శ్రీ రామమూర్తి వాళ్ళంతా మళ్ళీ బయల్దేరి జనక మహారాజు సభకు వచ్చారు. వచ్చినవాళ్ళకు జనక మహారాజు ఎదురేగి గౌరవించి పూజించాడు. అర్ఘ్యపాద్యాలిచ్చి ఉపచారాలు చేసాడు. జనక మహారాజుల పురోహితుడు అహల్యా గౌతముల పుత్రుడు శతానందుడు. శతానందుడు అడిగాడు విశ్వామిత్రుణ్ణి, "స్వామీ! అపి రామాయ దర్శితా మాతా? మా అమ్మగారి సంగతి రాములవారికి చెప్పారా? ఆమెను చూపించారా? అని. చేయవలసినదంతా చేసాను అన్నారు విశ్వామిత్రుడు.
జీవ కల్మష ప్రవృత్తిని భగవంతుని దగ్గర నివేదిస్తే కొంత పోతుంది, కొంత పాప పరిహారం. స్వామి అనుగ్రహ కటాక్షాలు దొరికితే సమస్త ప్రతిబంధకాలు తొలగిపోతాయి.
మీ తల్లి పునీత అయిందయ్యా అనగానే శతానందుడు చాలా సంతోషించాడు. ఏదీ, ఆ శివ ధనుస్సు చూపించమన్నారు జనకుడితో. ఆ శివ ధనుస్సు తెచ్చారు. "నాయనా! రామచంద్రా! ఒక్కసారి చూడు, ధనుర్దర్శయ రామాయ ఇతి హ ఉవాచ పార్థివః,(1.67.1),
నృణాం శతాని పంచాశత్ (1.67.4), యాభై వందలమంది, (ఐదు వేలమంది) తాడు కట్టి పట్టుకు వచ్చారట ఆ పెట్టెను. అంత బరువు. ఎనిమిది చక్రాల పెద్ద మంజూషలో పెట్టి ఉంచారు. "వత్స! రామ! ధనుం పశ్య" అన్నారు విశ్వామిత్రులు. చూడు అన్నారు, చూడమంటే విరిచినట్లు ఉండకూడదు కదా!
"స్వామీ! తోలనే పూరణేపి వా యత్నవాన్ భవిష్యామి," (1.67.14) చూడటం కాదు, ముట్టుకుంటాను, ఎత్తుతాను, పూరించడానికి ప్రయత్నిస్తాను, అన్నారు. ఓహ్! బాఢం, అన్నారు. శహభాష్. "ఆరోపయత్ స ధర్మాత్మా పూరయామాస తత్ధనుః,తత్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠః మహాయశాః,"(1.67.17) ఎత్తారు, "ఉత్క్షిప్తం సహ కౌశికస్య పులకైస్సార్థం," అన్నారు భరద్వాజులు తన రామాయణంలో. స్వామి ధనుస్సు నెత్తారు, విశ్వామిత్రుడికి పులకాంకురాలు ఎత్తుకున్నాయట, సీతమ్మ పెళ్ళి నా చేతులతో జరిపించినట్టు అయ్యింది అని. నానితం, వంచారు ధనుస్సు, భూపానాం ముఖైః, సైమల్టేనియస్ గా అక్కడ ధనుస్సు వంగితే ఇక్కడ రాజాధిరాజుల ముఖాలు వంగినాయట సిగ్గుతో. "సిగ్గు బరువున తల వంచినది ఒక్క సీతయే కాదు సభలోని క్షితిపతులును, "ఉత్క్షిప్తం సహ కౌశికస్య పులకైస్సార్థం ముఖైర్నామితం భూపానాం జనకస్య సంభ్రమ ధియా సాకం సమాస్ఫాలితం," అల్లికత్రాడు జివ్వని లాగారు. ఇక్కడ జనకుడు ఆనందంతో ఎగురుతున్నాడట, నా పని అయిపోయింది, నేను తలచిన పని నెరవేరిందని, జనకస్య సంభ్రమ ధియా సార్థం తత్ భగ్నం ధనుః ఇంతలో గట్టిగా లాగేసరికి శివధనుస్సు రెండు ముక్కలయ్యింది. భార్గవ ప్రౌఢాః అహంకృతి దుర్మదేన సహితం తత్ భగ్నం ఈశం ధనుః, గట్టిగా లాగేసరికి శివ ధనుస్సు రెండు ముక్కలయ్యిది. ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకుంటున్న పరశురాముడికి గర్వమూ భంగమయింది, ఇక్కడ ధనుస్సూ భంగమయింది." దోర్దండ ద్వితయేన ఖండ పరశోః కోదండ మారోపయన్, స్వామి ధనుస్సుని ఎత్తారు, కుర్వాణశ్చ విదేహ నృపతిం తీర్ణ ప్రతిజ్ఞా భరం," జనకుడికి గుండెలమీదనుండి పెద్ద భారం తొలగినట్టయింది. "సానందం కృశికాత్మజస్య.."విశ్వామిత్రుడి ఆనందానికి మితి లేకుండా పోయింది.
ఏ సగుణ, సాకార, దివ్య, శ్రీరామ కళ్యాణ వైభవాన్ని చూద్దామని, చేయిద్దామని వచ్చాడో అది జరిగినట్టే. చూరుమీద పడుతున్న వాన చినుకుల్లా ఆ కళ్ళ నీళ్ళన్ని జారి బారెడు తెల్ల గడ్డం మీద రాలాయట. ఇంతే కాదు, అక్కడ స్త్రీలంతా ఉన్నారు, "సుదృశం బృందేన కౌతూహలాత్," ఈ పెళ్ళిళ్ళలో ఆడవాళ్ళకి భలే ముచ్చట. పెళ్ళికూతుర్ని చూడాలని వాళ్ళు, పెళ్ళికొడుకుని చూడాలని వీళ్ళు. చెల్లరే విల్లు విరిచెనే నల్లవాడు పది పదారేండ్ల ఎలరాచ పడుచువాడు....సుదృశం బృందేన కౌతూహలాత్, తెరచాటునుండి చూస్తున్నది అమ్మవారు, సన్నటి మఖమల్ తెర. ..సవ్రీడం ప్రియయా, సిగ్గుదొంతరలు చుట్టుముట్టుకుంటున్నాయి మనోహరుడు ప్రియుణ్ణి చూస్తున్నానని, అవలోకిత ముఖః రామోస్తు నః శ్రేయసే|| ఇందరి చేత ఇన్ని విధాలుగా చూడబడ్డ రామయ్య మనకు సర్వ శ్రేయస్సులు కలిగించుగాక! వెంటనే దశరథుడికి కబురు చేసారు. ఆ! సంతోషించాడు దశరథుడు, ఆయనకు శుభకార్యాలంటే అసలే ఆనందం. తొందర, శుభస్య శీఘ్రం, వెంటనే బయల్దేరారు. మార్కండేయ, వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాత్యాయన, కణ్వ మొదలైన మహర్షులందరిని వెంటబెట్టుకొని బయల్దేరారు.
ఇంకో తమాషా, ఒక్క ముత్తయిదువ రాలేదు పెళ్ళికి, సీతారామ కళ్యాణంలో దశరథుడి వైపు నుండి వచ్చిన ఒక్క క్షత్రియ స్త్రీ లేదు. అది సూర్యవంశ రాజుల మర్యాద. పెళ్ళయిన తర్వాత కోడలిని తీసుకెళ్ళినపుడు ఇంటి దగ్గర ఆరతి ఇచ్చి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్ళడమే, కాని అత్తగారు పెళ్ళికి రాకూడదు. ఇప్పుడివన్ని లేవు, ఇది ఎప్పటిదో, వెనకటి సంగతి, మన ఆచారం, మన సాంప్రదాయం, వాళ్ళయొక్క నియమం, అందునా సూర్యవంశరాజుల విషయం. (మల్లాదివారి మాట, " ఇవన్ని నేను చాలా పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలు.") మరి వచ్చినవాళ్ళు ఎవరు? పోతు పెళ్ళికొడుకులు, గడ్డాలవారు, వశిష్ఠుడు, వామదేవుడు... ఎందుకండీ బ్రాహ్మణులంతా? గడ్డాలూపుకుంటూ వచ్చారు మొత్తం, ఆ! కూర్చున్నారు, ఏమయ్యా! వశిష్ఠ! వశిష్ఠుడు రఘువంశ కుల పురోహితుడు. పురోహితులదే పెత్తనమంతా.þ Ã
వశిష్ఠుల వారుచెప్తున్నారు, ఆదివంశవిశుద్ధానామ్ రాజ్ఞాం పరమధర్మిణాం | ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినాం| (1.70.44) మా వంశం ఎక్కడ, వైవస్వతమనువు నుండి వచ్చింది, బ్రహ్మాండమైన వంశం. మా దర్జా ఇది, మా స్టేటస్ ఇది అని చెప్పడం, దీన్నే ఎదుర్కోలు అంటారు. ఉత్తరా నక్షత్రం, రామచంద్రులవారిది సాధన తార, ఒక్క రోజులోనే అన్ని పెళ్ళీళ్ళు అన్నారు. మా తమ్ముడికి ఇద్దరు కూతుళ్ళు, మాండవి, శ్రుతకీర్తి. మా అమ్మాయి, ఇంకో భార్యకు కలిగింది ఊర్మిళ. ఆ అమ్మాయిని లక్ష్మణుడికి ఇస్తామన్నారు.
దీనికి కూడా ఒక కథ చెప్తారు. విరిగిన ధనుస్సు చూసి అంతా మూర్ఛపోయారట. వాళ్ళు లేచి చూసేసరికి లక్ష్మణుడు రెండు విరిగిన ముక్కలు (పుల్లలు) ఎత్తి చూపించాడట, ఓహో! ఇతను కూడా అంతటివాడే, ఇతనికి మా అమ్మాయిని ఇస్తాను అనుకున్నాడట జనకుడు. ఇవి హరిదాసులు వాళ్ళ కథలలో చెప్పే మాటలనుకోండి. ఒకే లగ్నం, ఒకేలగ్నంలో చేసుకోవచ్చా? ఒక శుభ కార్యం జరిగినపుడు ఏడాది దాటితే కాని చేయకూడదు. భిన్నోదరాః అతః, తల్లులు వేరైతే చెయొచ్చు అన్నారు. కాబట్టి రాముడికి లక్ష్మణుడికి, భరతుడికి చేయొచ్చు. కాని లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి ఎలా? దైవజ్ఞ విలాసం లో చెప్పారు,"భిన్నాంశకే తథా," లగ్నాన్ని ముప్ఫై డిగ్రీలుగా విభజిస్తే ఇరవైతొమ్మిదిలో ఒకరికి, ముప్ఫైలో ఒకరికి చేయొచ్చు. సర్వ శాస్త్ర సమ్మతమైన ప్రాజాపత్య వివాహం. రామయ్య పెళ్ళికొడుకాయెనే, మన సీతమ్మ పెళ్ళికూతురాయెనే, ఈ రోజుల్లో జరిగే పెళ్ళిలలో కూడా ఈ వాయిద్యం తప్పదు, వినిపిస్తూనే ఉంటుంది. ఈ జానక్యాః కమలామలాంజలిపుటే యా పద్మ రాగాయితాః, ఈ ముత్యాలు పోసుకొనే ఈ శ్లోక ప్రస్తావన తప్పదు. జగత్తుకు ఆదర్శమైన దంపతులుగా, పుణ్య స్వరూపులుగా సీతారాములను భావిస్తాం కనుక సీతారామకళ్యాణం మనం