మాతృపంచకం
ముగింపు వాక్యాలు
మాతృపంచకం
ముగింపు వాక్యాలు
శంకరులు తమ బంధువులను, పొరుగువారిని దహన సంస్కారాలకు సహాయం కోసం పిలిచారు, వారు అతనిని ధిక్కరించారు, సన్యాసి ఇలాంటి అంత్యకర్మలు చేయకూడదని, చేసే అధికారం లేదని చెప్పి వారవ్వరూ సహాయంచేయడానికి ముందు రాకపోగా,వాళ్ళు శరీర దహనానికి అగ్నిని కూడా ఇవ్వడానికి నిరాకరించారట. దీనితో మన ఆచార్యులే స్వయంగా తమ కుడి చేతి నుండి అగ్నిని సృష్టించి దహన సంస్కారాన్ని పూర్తి చేశారు.
ఇక్కడ మనం కొద్దిగా ఆలోచిద్దాం. వేదవేదాంగ నిష్ణాతులు, పురాణ, తత్త్వజ్ఞులు అయిన శంకరులకు ధర్మాధర్మ విచక్షణ లేదా? స్కందపురాణంలోని కాశీఖండంలో దీని ప్రసక్తి ఇలా ఉంది: న పిత్రోరధికం కించిత్త్రిలోక్యాం తనయస్య హి |
ఒక పుత్రుడికి తన తండ్రికంటే ప్రధానమైనది, తండ్రిని మించినది మరేదీ ఈ ముల్లోకాలలో లేనేలేదు. కించిత్-ఏదీ అస్సలు లేనేలేదని. అయితే
గర్భధారణపోషాభ్యాం పితుర్మాతా గరీయసీ || తన సంతానాన్ని గర్భంలో ధరిస్తూ, భరిస్తూ, పోషిస్తుంది కాబట్టి తల్లి తండ్రికంటె గొప్పది, తండ్రికంటే తల్లికి పెద్దపీట వేయాలి, అని.
సంన్యస్తాఖిలకర్మాపి పితుర్వంద్యో హిమస్కరీ | ఒక యతి అన్ని కర్మలను సన్యసించినప్పటికీ, తన శ్రేయస్సుకై (హిమస్కరీ-మనం తెలుగులో కడుప చలువకోసం అంటామే అదీ) తండ్రికి నమస్కరించాలి.
సర్వవంద్యేన యతినా ప్రసూర్వంద్యా ప్రయత్నతః || అందరి వందనాలు అందుకుంటూ, మన్ననలు పొందుతున్నప్పటికీ ఒక యతి ప్రసూ పదినెలలు మోసి, తనను ప్రసవించిన తల్లికి తప్పకుండా నమస్కరించాలి. ఆమె పాదోదకం తలపై చల్లుకుంటే అది గంగాస్నానం కంటె పవిత్రమైనదని ఉన్నది.
సన్యాసి అందరితోనూ తన అనుబంధాన్ని తెంచుకోవచ్చు కానీ తన తల్లితో అతని బంధం కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఆమె అంత్య క్షణాల్లో దగ్గర ఉండాలి, అంత్యక్రియలు నిర్వహించాలి. శ్రీ శంకరాచార్యులు అవతారమూర్తి. అందువల్ల తల్లి మరణం తర్వాత ఆచార కర్మలను నిర్వహించి తమ ప్రవర్తనతో ఇతర పరివ్రాజకులకు ఒక ఉదాహరణగా ఆదర్శంగా నిలిచారు.
https://sanskritdocuments.org/doc_z_misc_shankara/mAtripanchakam.html
(ఈ article అందరూ తప్పక చదవాలి)
https://www.sanskritam.world/ శంకర భగవత్పాదుల ఈ మాతృపంచకం వ్రాయడానికి ఈ సైట్లు ఎంతో ఉపయోగపడ్డాయి. వాళ్ళకి నా మనఃపూర్వక కృతాంజలులు. ఇది ఒక గ్రంథం కాకపోయినా, కేవలం శ్లోకాల అనువాదమే అయినా పూర్వాపరాలు ఆధికారికంగా ఉందాలి కదా! అందుకు.