గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. బెంగళూరుకి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరంలో ఉంది. గోకర్ణ శైవ క్షేత్రం. గోకర్ణ గ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు ఉన్నాయి. ఈ గ్రామం గోవా దగ్గరగా ఉండడం బీచ్లు సుందరంగా ఉండడంతో అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తోంది.
గోకర్ణ మంగళూరుకు ఉత్తరాన సుమారు 238 కి.మీ, బెంగళూరు నుండి 483 కి.మీ, కార్వార్ నుండి సుమారు 59 కి.మీ దూరంలో ఉంది. ఇది అరేబియా సముద్రం వెంబడి కార్వార్ తీరంలో గంగావళి, అఘనాశిని నదుల మధ్య ఉంది. ఇది సూరత్కల్, మణిపాల్ కళాశాల పట్టణాలకు ఉత్తరాన 200 కి.మీ దూరంలో ఉంది.
ముంబై నుండి మంగళూరు మార్గం లేదా గోవా నుండి మంగళూరు మార్గంలో కొంకణ్ రైల్వే ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ (గోకర్ణ రోడ్ అని పిలుస్తారు) పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉంది. స్టేషన్లో నామమాత్రపు ధరకు రిటైరింగ్ గది సౌకర్యం ఉంది.
రైలు సౌకర్యం
గోకర్ణ గ్రామానికి 10 కి.మి. దూరంలో మంగళూరు-ముంబాయి కొంకణ్ రైల్వే లైనులో గోకర్ణ రోడ్ రైల్వే స్టేషను ఉంది. కాని ఈ గోకర్ణ రైల్వే స్టేషనులో ప్యాసింజర్ బళ్ళు మాత్రమే నిలుస్తాయి. ఎక్స్ప్రెస్ బళ్ళు గోకర్ణకు 23 కి.మి. దూరంలో ఉన్న కుంటా, 25 కి.మి. దూరంలో ఉన్న అంకోలా, ఉత్తర కన్నడ రాజధాని కార్వార్లో నిలుస్తాయి.