వేదన

ఓ నేస్తమా నా ప్రాణమా నీ జాడ తెలుపవే

నేనొంటరినై నీ వియోగినై విరహాన వేగితినే

కలలు కరిగి నా ఆశలుడిగి నే విరాగినైతినే

మమత మునకలై వలపు తునకలై నే శిలనైపోతినే

ఓ నేస్తమా నా ప్రాణమా ||

చిరుగాలి కదలికలో నీ కురుల కితకితలె

జాబిల్లి దశలలో నీ మోవి కళకళలె

ఆపొద్దు ఈ పొద్దు నీ చెక్కిళ్ళ అక్కసులే

ఊపిరైనగాని నీ ఊహకే బానిసలే...