ఏకాకి

కాల కడలి పై కెరటాల కులుకులకు

తునకలై పోయింది నా జీవితం

అయినా కడలి పై మోహం చావని నావికునిమల్లె

మరల మరల ఎగబాకుతాన్నేను కాలం తో ఎదురీతకై

గబ్బిలాలు నన్ను గేళి చేస్తున్నాయి

చీకటి బిలంలో ఒంటరిగ వ్రేళ్ళాడుతున్నందుకు

శీత గాలి చెవిలో ఊళ పెడుతోంది

బూడిత బొంతకింత వగపేలని

నింగిలోన కాటికాపరి లాగ

ఒంటరిగ తిరుగాడుతోంది జాబిల్లి

రిక్కల కార్చిచ్చులకు కావలి కాస్తూ

కొండ మీది బండ రాళ్ళే గాలికెగిరొచ్చి

కర్రి మబ్బులై నన్ను బెదిరిస్తున్నవి

గుండెలోన కోత పుడుతుంది అలలు సెలలు కాగ

దిగులు పైపైకి ఎగదన్ని గొంతు మూగవోగ

నిశి రాత్రి ముసిముసిగ నవ్వుకుంటోంది

తన కసినంతా నాపై వెళ్ళగ్రక్కుతూ

చెంతనే అందరూ ఉన్నా కూడా ఏ ఒక్కరూ

నాకక్కరకు రాజాలరా తరుణాన

ఎందరిలో ఉన్నా నేనొంటరినన్న తలంపు

నన్ను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది

దేనికోసమో తెలియని ఈ అర్థంకాని ఆరాటం

నా తోనే, నా లోనే ఓ చేతకాని పోరాటం

ఒక క్షణం అలవి కాని దిగులు తో క్రుంగిపోతాను

మరోక్షణం అంతులేని కోపంతో రగిలి పోతాను

దిగులెందుకో కోపమెవరి పైనో తెలియరాదు

ఊహకందని ఊసులేవో గుబులు రేపేను

మరపు నెఱుగని మమతలేవో దిగులు పెంచేను

ఓటమోరని ...... రగిలి పోయేను

.... ...... పొగిలి ఏడ్చేను

ఓడిని ప్రతిసారీ కూడిన సత్తువతో

...