సమైక్యాంధ్ర

తెలుగు భాష మనదిరా

ఆంధ్ర జాతి మనదిరా

వేల ఏళ్ళ చరిత మనది

ఘనమైన కీర్తి మనది

విశిష్ట సంస్కృతి మనది

విభిన్న పద్ధతి మనది.

వల్లభదేవుని మొదలు

కోటిలింగాల శాతవాహనులు

విజయపురి ఇక్ష్వాకులు

ఓరుగల్లు కాకతీయులు

వేంగి చాళుక్యులు

చోళులూ రాయలూ

ఎందరెందరో...

రెండు సహస్రాబ్దుల పైబాటు

తెలుగు వారిని ఆంధ్ర జాతిని

ఒక్క త్రాటి పై నడిపి

ఒకే సంస్కృతిగ నిలిపి

భరత వర్ష మందు

ఆంధ్ర జాతి భళిరా

యని దేశ దేశముల యందు

మన కీర్తిని ప్రజ్వలింప జేసిరి.

వేదాల లో ఉపనిషత్ లలో

రామాయణ భారతాలలో

మనమంతా ఒక్కటని

ఆంధ్ర జాతి మనదని

తెలుగు వారం మనమని

చదివి విని గర్వ పడే

తెలుగు వారలందరికీ

చెప్ప మనసు రాని గాయం చే

ఏర్పడిన రెండు శతాబ్దాల

ఎడబాటును అడ్డు చూపి

ఐదు దశాబ్దాల నుంచి

స్వార్ధ పరులు కొందరు

తెలంగాణ పేరిట

వేరు కుంపటి రేపుతుంటే...

తెలుగు తల్లి మరో మారు

పురిటి నొప్పులు పడుతున్నది

ఈ చీలిక తానోర్వ లేనని

భరత మాతకు మొరపెట్టుకుంటున్నది!

తెలుగు వీర లేవరా తెలంగాణ సోదరా

చీలిక పేరు చెప్పే నాయకుల

నాలుకలు చీల్చి చెండాడరా.

తెలుగు వారలందరం

ఎప్పటికీ ఒక్కటేననీ-

తెలుగు భాష మనదని

ఆంధ్ర జాతి మనదని

మనమంతా ఆంధ్రులమని

భరత మాత బిడ్డలమని-

దిక్కులు పిక్కటిల్లేలా

సమైఖ్యాంధ్ర నినాదాన్ని

యావదాంధ్ర జాతి లో

ఏకమై వినిపించరా.

/- హరిణి