నువ్వు - నేను 

నువ్వొక నది

నేనొక సాగరం

వెనక్కి పోలేవు నువ్వు

ముందుకు రాలేను నేను

నీ గమనం నా కొకే

నా మధనం నీ వరకే

నీ గమ్యం నేను

నా ఆద్యం నువ్వు