మౌన రాగం

ఏ పాట పాడ మందువు ప్రియా

నన్నే కబురు చెప్ప మందువు?

చిన నాట నువ్వు నేను ఏటి వొడ్డున చేరి

పిచ్చుక గూళ్ళు కడుతూండగా

చిలిపిగా నేను వాటిని చెదర గొట్టినపుడు ...

నీ చిట్టి చేతులతో నువ్వు నన్ను కొట్టగా

నే ఏడ్వ నటియింప నీ కనుల నీరు చీరెనే —

అది జూచి నే చలియించి నిను నా ఒడిలోనికి తీసుకుని

నీ కురులు సవరిస్తూ నీ కనులు ముద్దాడుతూ

అలవికాని దుఖ్ఖాన్ని ఆపుకోలేక

ధారలుగ కన్నీరు ఏరులై పారేట్టు

ఏడ్వగా ఏడ్వగా ఇరువురము

సొలసి సేద తీరె ఒకరి వొడిలో ఒకరము

గురుతుందా నా నెచ్చెలి...

పాడటానికి మాటలు కరువాయె

నీ తలపులతో హృదయమే బరువాయె.

ఏ పాట పాడమందువు సఖి

ఏ కబురు చెప్పమందువు!

/- హరిణి