చంద్రునికో నూలు పోగు

తెలుగు వారలందరమూ గర్వపడేంతటి సాంస్కృతిక సాహిత్య వాఙ్మయ వారసత్వాన్ని అంది పుచ్చుకుని కూడ ఆంగ్ల భాష పై మోజుతో మన మాతృ భాషను అలక్ష్యం చేస్తూ మన పూర్వులకూ మన భావి తరాల వారికి కూడా ఎంతో అన్యాయం చేస్తున్నాము; ఇదిలాగే కొనసాగితే మన తరువాతి తరానికే తేనెలొలుకు తెలుగు కాలగర్భంలో కలిసిపోవలసి వస్తుంది.

ఇకనైనా మేలుకొనక పోతే మనల్ని మనమే క్షమించుకొలేనంతటి తప్పు చేసినవారమవుతాము; అందుకే చంద్రునికో నూలుపోగు లా మనం నిత్యం మాటలాడుకునే ఆంగ్ల పదాలకు సరిపడు అర్థాన్నిచ్చే తెలుగు పదాలను ప్రోది చేయుటకు నేనీ చిన్న ప్రయత్నం మొదలెట్టాను. ఎప్పటి లానే మీ సలహాలూ సద్విమర్శలూ అందజేస్తారని ఆశిస్తూ...

సారస్వత ఆంగ్ల ఆంధ్ర నిఘంటువు

Telugu Vocabulary