వామన (పొట్టి) కవితలు

గుబురు పొదలో.... గుబులు ఎదలో...

చూసాను ప్రేమికులను, ఒక గుబురు పొదలో

చూడగనే కలిగెను, తెలియని గుబులు ఎదలో

--- చైతన్య శర్మ 1-May-2013

కందెను

కందెను నీ సొగసు నువు నేల నడవగానే

నా కందెను ఆ సొగసు ఏల అడగగానే?

--- చైతన్య శర్మ 25-Apr-2013

దండ

దండలేస్తున్న పంతులు ...

దండాలెడుతున్న భక్తులు

--- చైతన్య శర్మ 7-April-2013

తెలుపు

ముందువెనుకల తెలుపు,

ఇరు పక్కలన తెలుపు,

ఆకసమ్మును జూడ అది గూడ తెలుపు,

మంచి భావము ఉన్న ప్రతి మనసు తెలుపు,

తెలుపు ఇది అని "తెలుపు" నా భాష తెలుగు. (తెలుపు)

--- చైతన్య శర్మ 18-Jan-2013

చిత్రం

ముందు వెనకల నున్నసూర్యుని,

మదిలోన గాంచక (మనసుతో గ్రహియింపలేక)....

చిత్రగ్రాహిని చేతపట్టుకు కూర్చుండుటెంతటి చిత్రమో!!

మరను పట్టుకు వెతుకులాడితే ...

మనసునుండుట సాధ్యమా!!!

"రవి" మనసునుండుట సాధ్యమా !!!

--- చైతన్య శర్మ 18-Nov-2012

వేటూరి-1:

రాలిపోయినదొక సినీరాగం

మిగిల్చినది మనకు మౌనరాగం.

వేటూరి పై వేసాడు దేవుడు వేటు,

సినీపాటకు తీర్చలేనిది అతని లోటు.

వేటూరి-2:

అయినా ... మూగాబోతే ఒక కవి కలం,

మూగబోదు ఈ కవి కులం,

వదలిపోతే శ్రీ శ్రీ రాలేదా వేటూరి,

వెళ్ళిపోతే వేటూరి వస్తాడొక చిన్నారి,

కవిత్వమనే ఈ వనంలో ప్రతి వొక్కడూ బాటసారి !!

--- చైతన్య శర్మ 23-May-2010