తర్కం తత్త్వం

లోకం తీరు

భయపడితే భయపెడతారు.

భయపెడితే భయపడతారు.

--- చైతన్య శర్మ 25-Jun-2013


నమ్మకమంటేనే మూఢత్వం

తరచి చూడగా "నమ్మకానికి, మూఢనమ్మకానికి తేడాలేదని" తోస్తున్నది. ఎందుకనగా నమ్మే ప్రతి విషయం మనం మూఢత్వంతోనే నమ్ముతాము.

నిజమో/ అబద్ధమో, ఉన్నాడో/ లేడో, చెయ్యగలమో/ చెయ్యాలేమో, గెలుపో/ ఓటమో ... తెలియనప్పుడే "నమ్మకం" అనే పదం వస్తుంది, తెలిస్తే పై వాటిలో ఏదో ఒకటే మిగులుతుంది.

కనుక నమ్మకమంటేనే మూఢత్వం.

తర్కం లో తప్పు ఉంటే సరిదిద్దండి.

--- చైతన్య శర్మ 12-Dec-2011

వర్తమానం

గతం అనే గవాక్షాన్ని వీడినవాడు

భవిష్యత్తు అనే భారాన్ని మోయనివాడు మాత్రమే...

నేడు అనే నందనవనంలో విహరించగలడు

వర్తమానమిచ్చే వరాలను అందుకోగలడు

--- చైతన్య శర్మ 07-Oct-2011

సన్నాసి....సన్యాసి

చెయ్యలేక వదిలేవాడు సన్నాసి

చెయ్యాల్సిన అవసరం లేదని వదిలేసిన వాడు సన్యాసి

--- చైతన్య శర్మ 15-Jun-2010

తప్పెవరిది ?

తాటి చెట్టు కింద పాలు తాగినా,

వెలయాలి ప్రక్కన తమ్ముడు వున్నా ప్రపంచం చూసేది మరోవిధంగానే ...

--- చైతన్య శర్మ 06-Jun-2010

ఆకలి

ఈ దేవుడికి ఓ పది రోజులు నైవేద్యం పెట్టడం మానేస్తే గాని అర్ధం కాదు పేదవాళ్ళ ఆకలి బాధ.

--- చైతన్య శర్మ 25-May-2010


అమ్మని తలవడానికి ఒక్క రోజేనా?

అనుదినం అమ్మని తలవని అభాగ్యులు ఈనాడైన ఆమెను ఆశీర్వదించమని అర్ధిస్తారని,

ఆమె హృదయాన్ని ఆనందడోలికల్లో విహరిమ్పచేస్తారనే ఆశతో...

--- చైతన్య శర్మ 09-May-2010

ఉంటే...ఉన్నట్టే

ఉంటే విచక్షణ ,

కలిగుంటే క్రమశిక్షణ,

ఉన్నట్టే నీ జీవితానికి రక్షణ.

--- చైతన్య శర్మ 08-Apr-2010

వివేకం

నువ్వు ఏడ్చే ప్రతి ఏడుపు నీలో వివేకం వెలుగొందడానికి ఒక్క నిమిషం ముందువరకే అని గుర్తుంచుకో నేస్తమా !!!

--- చైతన్య శర్మ 08-Apr-2010

తనవశం...పరవశం

మనసు పరవశం చెందడం గొప్ప అని అనుకున్నా!

తనవశంలో లేని మనసు పెట్టే బాధ అనుభవించా!

కనుక మనసు పరవశం కాదు మన వశం కావలి.

అవుతున్నాది!

--- చైతన్య శర్మ 23-Mar-2010