"భజ గోవింద" పద్యాలు

శ్లోకం:

బాల స్తావత్ క్రీడాసక్తః

తరుణ స్తావత్ తరుణీసక్తః |

వృద్ధ స్తావత్-చింతామగ్నః

పరమే బ్రహ్మణి కో‌உపి న లగ్నః ||


పద్యం:

బాల్యమంత గడిపె ట పాటల తోడ

యువతి కొరకు విడిచె యవ్వనంబు

ముసలి తనము నాడు ముంచులే చింతలు

రుక బాట తాను రుగు నెపుడొ!


శ్లోకం:

నారీ స్తనభర నాభీదేశం

దృష్ట్వా మా గా మోహావేశమ్ |

ఏతన్మాంస వసాది వికారం

మనసి విచింతయా వారం వారమ్ ||


పద్యం:

కామ వాంఛ నిన్ను మ్ముచున్నదదేల,

ఒంటి మీద నున్న ఒంపు చూడ?

రచి నావు ఏమొ మాంసపు ముద్దని,

తోలు కప్పి ఉండ తెలియ లేదొ!