వచన ప్రాసలు

ఆడ

"ఆడ" లేని సినిమా ... ఆడలేదు అని ఒక ఆడది అంటే ...

"ఆడదా?", అని ప్రశ్నించి ... ఆడకెళ్ళి చూస్తే ... సినిమా ఆడ లేదు ....

అంటే బాగా ఆడలేదు!!

--- చైతన్య శర్మ 20-Apr-2012

( ఆడది లేని సినిమా విజయవంతంగా నడవదు అని ఒక ఆడది అంటే...ఆడది లేనిదే ఆడదా అని ఆమెను అడిగి ... దగ్గరలో ఉన్న అలాంటి సినిమాకి వెళ్దాం అని వెళ్లేసరికి...అక్కడ ఆ సినిమా లేదు అని తెలుసుకున్నాను...అంటే ఆ సినిమా బాగా నడవలేదు అనే కదా, లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు నడుస్తుంది అని!)


కన్నె

నే కన్నేసిన కన్నెను కన్నానని కన్నెతో కట్టబోయాడు ఆమె కన్నతండ్రి .

ఎంతటి మూర్ఖత్వం!!!

కన్నెతో కడితే ఆగడానికి, ఆమె ఏమైనా చిన్నదా ??? కన్నెది !

--- చైతన్య శర్మ 18-Apr-12

బాధేసింది

అమ్మకు బాధేసింది, నాన్నకు కూడా బాధేసింది,

ఎందుకంటే అమ్మకు బాధేస్తే ...నాన్నను బాదేస్తుంది!!!

--- చైతన్య శర్మ 15-Apr-2012

వేదం (movie):

వెనుక నుంచి కీరవాణి నాదం,

ముందు కేబుల్ రాజు చేసే వినోదం,

అక్కడక్కడ అనుష్క అందాలతో ఆహ్లాదం,

రాములు పాత్రతో జీవితంలోని విషాదం,

మంచు పాత్రకి మాంచి రిధమ్,

brahmi పాత్ర అర్ధంకాని ఓ అగాధం,

మొత్తం కలగలిపితే రాధాకృష్ణ వేదం,

మొత్తానికి కలిగించింది నా మనసుకి ప్రమోదం

--- చైతన్య శర్మ 08-Jun-2010

పరిశోధనా కార్యక్రమానికి నాంది

నేడే పరిశోధనా కార్యక్రమానికి నాంది పలకబోతున్నాను.

పుట్టిన్చినందుకు విధాత,

కన్నందుకు మాత,

పెంచినందుకు తాత,

తీర్చిదిద్దినందుకు పిత,

నా భారాన్ని మోస్తున్నందుకు భూమాత,

పోషిస్తున్నందుకు భారతమాత ...

గర్వించేలా శోధించాలని,

శోధించి ప్రజలకు శాంతిని ప్ర"సాధించాలని"

దీవించండి మిత్రులారా!!! దేవతలారా!! నా గురువులారా!!

----చైతన్య శర్మ 10-May-2010