యాదృచ్ఛిక పద్యాలు (Random poems)

క్ర తుండమునకు వందనములు చేసి

ఎందరెందరొ ఇల నందముగను

రాసె పద్యములను త్నాల మాదిరి

వారి నందఱకును వంద నములు


వేలకొలది రాసె వేమన్న పద్యాలు

టవెలది లోన పకుండ

తని పద్యములను రార చదువుగా

బ్బె నాకు కూడ టవెలది


గురువు లఘువు రాదు, గుర్తెంచ గణములు

తెలియు నొకటె నాకు తెలుగు భాష

ట్టి నేను రాసె టవెలది లోన

ఇంత కంటె వేరె వింత గలదె


రాయ వచ్చు మనము రేయింబవళ్ళును

వేల వేల కొలది వేగముగను

సంఖ్య పెరిగినంత సంపద పెరుగునా

మంచి పద్యమొకటి నకు చాలు


శ్రద్ధ పెట్టి చూడ తకమ్ము నైనను

రాసి చూప వచ్చు రాత్రి లోన

మనసు ఒక్కటి మన అదుపులో ఉండిన

హిని చూప వచ్చు హిమలెన్నొ


ల్లినంత పద్యమాశువుగా తాను

ధికుడగునె ఉత్తి హము గాక

తాను ఇలను లేక నపద్యముండిన

అప్పుడగును తాను గొప్ప వాడు


ద్యమొచ్చినంత రమాత్ముడవ్వడు

శాస్త్ర మెరుగ కాడు శాస్వతుండు

విద్యవచ్చినంత విర్ర వీగుటదేల

న్ని విద్య లవియు న్నమునకె


భౌతికమ్ము అయిన భౌగోళ మైననూ

శాస్త్రమేది అయిన త్తువున్న

లుక వచ్చు మనము ద్య రూపమునందు

తెలుప వచ్చు తేట తెలుగు లోన


కంద పద్యమెంత అందమై యున్ననూ

చెప్పినాడె వేమ న్నడైన?

తాను పట్టుకున్న టవెలది లోన

ల రాసి నాడొ వేలకొలది?


న్న ఆయువంత రి పనుల పెట్టి

ముక్తి మార్గమెపుడు ముట్టలేదు

బోడి గొప్ప వల్ల బొందిన దేమిరా

రణమొకటె మిగిలె రణమునకు


29-Nov-2018

వేమనగారి పద్యాలు పలుమార్లు చదువుగా నాకూ ఆయనలా ఒక పద్యం రాయాలని అనిపించింది. కానీ ఆయనలా నేను ఎందుకు రాయలేనో చెప్పడానికి వ్రాసినదే ఈ క్రింది పద్యం :)


ఆటవెలది:

ప్రాస తప్పకుండ దములను లయలో

వేసినంత శర్మ వేమనగునె

గాడిదొకటి వచ్చి నముగా గెంతిన

వెఱ్ఱిదగును కాని గుఱ్ఱమగునె?


ఛందోబద్ధంగా నేను తెలుగులో వ్రాసిన మొదటి పద్యం కూడా ఇదే :D