నువ్వు నేను comedy /philosophy

పాడ వేణువు వలె నీవు

పాద రేణువు వలె నేను ... నీ పాద రేణువు వలె నేను

వేనోళ్ళ కొనియాడ నీవు... జనుల్ వేనోళ్ళ కొనియాడ నీవు

వేలేత్తి చూపించ నేను...జనుల్ వేలేత్తి చూపించ నేను

వెన్నలా మది కరుగ అది నీ పాట

వెన్నులో దడ పుట్ట అది నా పాట

ఎద కరిగెనా వెన్నలా అది నీ పాట

వ్యథ కలిగెనా వెన్నులో అది నా పాట

JACS కమ్యూనికేషన్ నువ్వు. (You are like JACS communication)

LACK of కమ్యూనికేషన్ నేను ( I am lack of communication)

టేకు మొక్కల పెంచగా నువ్వు

పేక ముక్కలా దించగా నేను

Next paper కోసం నువ్వు (You are waiting for the next paper)

First paper కోసం నేను ( I am waiting for the first paper)

ఇటుక మేడలా నువ్వు

ఇసుక మేడలా నేను

మేడపై రాజులా నువ్వు

గోడపై బూజులా నేను

బలుబులా విరజిమ్ముతూ నువ్వు

జలుబులా తెగతుమ్ముతూ నేను

అచ్చేసిన పుస్తకాన్ని తెరుస్తూ నువ్వు

అచ్చోసిన ఆంబోతులా అరుస్తూ నేను

పేపర్లకై పట్టుదలతో నువ్వు

పేపర్లు లేక బట్టతలతో నేను

కళ్ళ జోడులా తలపై నువ్వు

కాళ్ళ జోడులా ఇలపై నేను

రవిలా అందరినీ చూస్తూ నువ్వు

కవిలా ఒక్కడినై రాస్తూ నేను

Revolution లా మార్పు కోసం నేను

Evolution లా మార్పులను సృష్టిస్తూ నువ్వు

Like a Revolution I am waiting for the change

Like an Evolution You are creating the change

Crossproduct లా కొత్త దిశల్లో నువ్వు

Dotproduct లా దిక్కు దిశ లేక నేను.

You are like a Cross product: Creating always new directions

I am like a Dot product: Destroying my own direction also

--- అసంపూర్ణం