🙏అంతరయోగము (సత్సంగము) ఆహ్వానం@
శ్రీ రామకృష్ణ-వివేకానంద సేవా సమితి , KPHB-మియాపూర్(SRKVSS,KPHB-Miyapur)🙏
🙏అంతరయోగము (సత్సంగము) ఆహ్వానం@
శ్రీ రామకృష్ణ-వివేకానంద సేవా సమితి , KPHB-మియాపూర్(SRKVSS,KPHB-Miyapur)🙏
***************************************************************************************
ఒక్క చేతితో దేవుని ఆసరాగా పట్టుకొనుము, మరోచేయి పనికి ఉపయోగించు కొనుము. పనుల మధ్యలో అప్పుడప్పుడు కొంత సమయం వీలు చేసుకుని ఏకాంతముగా భగవంతుని ధ్యానము, మనన, స్మరణ, భజనలు చేయటం ద్వారా ఆధ్యాత్మిక పథములో పురోగమించాలని శ్రీరామకృష్ణులు గృహస్థులకు ఉపదేశించారు.
భక్తులందరూ కలసి చేసే ఏ చిన్న సాధన అయినా ఆనందాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుందని గురువచనం.
ఆ స్ఫూర్తితోనే మన SRKVSS,KPHB-Miyapur సమితి అంతరయోగా కార్యక్రమాన్ని నిర్వహించ సంకల్పించింది .
పూజ్యశ్రీ స్వామి తత్పదానంద మహరాజ్, రామకృష్ణమఠం, Hyderabad మరియు పూజ్యశ్రీ స్వామి అధీశ్వరానంద మహారాజ్,RK Mission,near Keesara(v),Yadadri-Bhuvanagiri Dist. ల అనుగ్రహభాషణములు, భజనలు, ... ,,, కార్యక్రమాంశాలు .
ఈ పవిత్ర కార్యక్రమంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, శ్రీరామకృష్ణపరమహంస దేవుల అనుగ్రహము బడయవలెనని మనవి.
వేదిక : SriRamaKrishna Dhyana Mandiram(శ్రీరామకృష్ణప్రభ office@SriRamaKrishna Vivekananda Seva Samiti, KPHB-Miyapur, Plot No.166(R/o.Dr.K.Chandra Sekharaiah, JNTU Professor), House No.1-142/166, Vivekananda Street, Near Radha Madhav Apartments Junction, Pragati Enclave Colony, Near Miyapur Post Office-Hanuman Temple Road, Beside Miyapur Patel Cheruvu, Miyapur(V), Serilingampally(M), Hyderabad 500 049.
తేదీ, సమయం: 31August2025 ఆదివారం ఉ. 10:00 నుండి మ. 12:30 వరకు
కార్యక్రమములు : వేద పఠనం, కార్యక్రమ పరిచయము, నామపారాయణం, సత్సంగం, జపము , ధ్యానము, భజన, హారతి, రామకృష్ణ శరణం, ప్రసాదం
అందరూ అధిక సంఖ్యలో పాల్గొని,ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగించుకుని, భగవదానందాన్ని ఆస్వాదించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వాగతం. సుస్వాగతం.
ఇట్లు భగవత్ సేవలో ,
శ్రీ రామకృష్ణ-వివేకానంద సేవా సమితి, KPHB-మియాపూర్
9849352231, 9059892038 https://sites.google.com/view/vivektelugu/contact
***************************************************************************************