Ma Sharada, Swamiji, Gurumaharaj Jayanti Celebrations2025
శ్రీరామకృష్ణవివేకానంద సేవా సమితి Press Note dt.28Mar2025 heading: విద్యార్థులకు శ్రీరామకృష్ణవివేకానంద సేవా సమితి బహుమతుల కిట్ల ప్రదానం
శ్రీరామకృష్ణపరమహంస గురుదేవుల జయంతి సందర్బంగా వారోత్సవాలును 21-28Mar2025 లలో శ్రీరామకృష్ణవివేకానంద సేవా సమితి, ప్లాట్ నెంబర్166, ప్రగతి ఎంక్లేవ్ కాలనీ, మియాపూర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శేరిలింగంపల్లి మండలం లోని ZPHS,మియాపూర్ మరియు ZPHS,మక్తా-మహబూబ్ పేట విద్యార్థులు క్విజ్ పోటీలు మరియు 'ఉత్తిష్ఠ భారత' బృందగానం పోటీలులో 72మంది పాల్గొన్నారు. స్వామి వివేకానంద సందేశగీతాలను బృందగానం చేశారు. సర్టిఫికెట్లు, బహుమతులకిట్లను సమితి ధ్యానమందిరంలోను, రెండు పాఠశాలల్లోను 3 దశలలో విద్యార్థులకు అందజేశారు. 28Mar2025 న ZPHS,మియాపూర్ లో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వసుంధర, ఉపాధ్యాయులు, శ్రీ మదన్ మోహన్, శ్రీమతి విజయ మరియు సమితి ప్రతినిధి శ్రీ డి.దత్తాత్రేయ సర్టిఫికెట్లు, బహుమతుల కిట్లను 40 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే, ZPHS@మక్తా-మహబూబ్ పేటలో ప్రధానోపాధ్యాయులు శ్రీ నరేందర్ రాజు, సహాధ్యాపకులు, JNTUH వరిష్ట ప్రాచార్యులు మరియు సమితి కార్యదర్శి అయిన Dr.K.చంద్రశేఖరయ్య సర్టిఫికెట్లు, బహుమతుల కిట్లును 32 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. మొత్తం 72 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని లబ్దిదారులయ్యారు. వ్యక్తిత్వవికాసం గురించిన రామకృష్ణమఠం ప్రచురణలు, నోటుబుక్స్, ఫైళ్లు, పెన్నులు కలిగిన PAIRS Foundation ప్రాయోజిత 72 కిట్లను ఒక్కొక్కటి సుమారు 350 రూపాయలు విలువ గలవి పోటీలలో పాల్గొన్న 72 మంది విద్యార్థులందరికీ బహుమతులుగా అందజేశారు. విద్యార్థులకు వ్యక్తిత్వవికాసం నొసగే అంశాలపై, మాధ్యమికకౌశలాలపై పోటీలను నిర్వహించిన రెండు పాఠశాలల అధ్యాపకులకు సమితి కార్యదర్శి, JNTUH వరిష్టప్రాచార్యులు అయిన Dr.కే.చంద్ర శేఖరయ్య శుభాభినందనలు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు వేసవి శిక్షణాశిబిరం, ప్రతి ఆదివారం నిర్వహించే స్పోకెన్ ఇంగ్లీష్, ప్రత్యేక శిక్షణాతరగతుల వంటి సమితికార్యక్రమాల వివరాలను 9849352231 లో సంప్రదించవచ్చు.