విసర్గలు పోల్చుకొనుట

విసర్గలు పోల్చుకొనుట ఎట్లు ?



విసర్గసంధి సూత్రాలు :

విసర్గసంధులు :



1. విసర్గలకు క ఖ ప ఫ లు పరమగునపుడు విసర్గలకు లోపము రాదు.

ఉదా:

తపః + ఫలము = తపఃఫలము

మనః + కమలము = మనఃకమలము

అంతః + పురము = అంతఃపురము

తేజః + కీర్తి = తేజఃకర్తి



2. విసర్గలకు చ ఛ లు పరమగునపుడు శ కారము, ట ఠ లు పరమగునపుడు ష కారము, త థ లు పరమగునపుడు స కారము వచ్చును.

ఉదా:

తపః + చర్య = తపశ్చర్య

తపః + చరణ = తపశ్చరణ

ధనుః + టంకారము = ధనుష్టంకారము

మనః + తాపము + మనస్తాపము



3. విసర్గలకు స శ ష లు పరమగునపుడు స శ ష లు వచ్చును.

ఉదా :

మనః + సాక్షి = మనస్సాక్షి

తపః + సాధనము = తపస్సాధనము

మనః + శాంతి = మనశ్శాంతి

చతుః + షష్టి = చతుష్షష్టి



4. విసర్గాంత శబ్దములకు అచ్చులు, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములు, హయవరలు పరమగునపుడు రేఫము ఆదేశమగును.



ఉదా :

అంతః + ఆత్మ = అంతరాత్మ

చతుః + భుజుడు = చతుర్భుజుడు

చతుః + వేదములు = చతుర్వేదములు

ధనుః + విద్య = ధనుర్విద్య

ధనుః + బాణములు = ధనుర్బాణములు

పునః + దర్శనము = పునర్దర్శనము



హ్రస్వ అకారము మీద విసర్గకు వర్గ తృతీయ చతుర్థ, పంచమాక్షరములు, హయవరలు పరమగునపుడు ఓకారము ఆదేశముగా వచ్చును.

ఉదా:

తపః + వనము = తపోవనము

మనః + రథము = మనోరథము

శిరః + రత్నము = శిరోరత్నము

వచః + లావణ్యము = వచోలావణ్యము

మనోవేగము, తపోధనము, మనోనేత్రము మొదలగునవి ఇట్టి పదములే.



ఈ సంధులను వెనుక నుండి చదువుకొంటే

1).

తపో, మనో, శిరో, వచో పదములలో వలె పదము వెనుక

ఓ కారము ఉంటే విసర్గను సూచిస్తుంది



2).



చతు ర్వేదములు, ధను ర్బాణములు, ధను ర్విద్య, పున ర్దర్శనము లలో వలె పదము తర్వాత రేఫము ఉంటే ఆ రేఫము విసర్గను సూచిస్తుంది



3).



, , ష లు పదాంతములో ద్విత్వాక్షరాలుగా ఉంటే

మన స్సాక్షి, మన శ్శాంతి, చతు ష్షష్టి లులో వలె అచట విసర్గ ఉందని తెలుస్తుంది



4).



తప శ్చర్య , మన స్తాపము, ధను ష్టంకారము పదములలో వలె శ్చ , స్త , ష్ట సంయుక్తాక్షరాలు ఉంటే వాటిలో శ , , ష లు విసర్గకు బదులు వచ్చాయని తెలుస్తుంది .