రామాయణ ఘట్టాలతో అలంకరించిన రుమాలు

వాల్మీకి తెలుగు 

రామాయణము 

31, అక్టోబరు – 2010 తారీఖున పెట్టిన టపా

రామాయణ ఘట్టాలతో అలంకరించిన రుమాలు / చేతిగుడ్డ / గుడ్డ పటము.

భారతదేశము, జమ్మూ- కాశ్మీరు లోని చంబా దేశమునకు చెందినది.

కాలము- సామాన్యశకం 18.

వస్తువు- నూలు పట్టుల చేనేత గుడ్డపై కాకి బంగారము / ముచ్చి బంగారము, లోహపు జరీ బుటా (ఎంబ్రాయిడరి) చేసినది.

ఉత్తరభారతమునందు హిమాలాయ పర్వతపాద ప్రాంత ప్రజలు చేతిగుడ్డను రుమాలు అందురు. చక్కటి చిత్రాలతో అలంకరింపజేసిన చేసిగుడ్డ వంటి గుడ్డ పటమును బహుమతిగా ఇచ్చు సంప్రదాయము భారతదేశమున కలదు.

ఆవిధంగా చంబా దేశపు ఈ ప్రత్యేక చంబా సంప్రదాయ బుటా రుమాలు పని చేసినవి చంబా రుమాలు అని ప్రసిద్ధి.

సాధారణంగా చంబా రుమాలు మీద శ్రీకృష్ణునికి శ్రీరామునికి మున్నగు అవతారాలకు చెందిన వైష్ణవ సంప్రాదాయ వృత్తాంతములు చిత్రిస్తారు.

ఈ చంబా రుమాలును ప్రసాదాలు, వాయనాలు వంటివి వాటిపై కప్పుటకు వాడతారు.

ఇక్కడ చూపిన రుమాలు మీద శ్రీమద్రామాయణ ఇతిహాస ప్రధాన ఘట్టాలను సూచించే చిత్రాలతో అలంకరించారు.

పై వరుసలలో ఎడమ నుండి కుడి వైపునకు,

1. కోట బురుజులు క్రింద మాతా కౌసల్యాదేవి నుండి శ్రీరామ లక్ష్మణ సీతలు సెలవు పుచ్చుకుంటున్నారు.

2. దాని ప్రక్కన పైన పొదలు చెట్లు క్రింద శరామ లక్ష్మణ సీతలు అడవికి వెళ్తున్నారు.

3. పైన ఉన్న చెట్లు అడవిలో అని సంకేతం క్రింద సీతా దేవి మాయా సన్యాసిగా ఉన్న రావణునికి బిక్ష తెస్తోంది

4. దానిప్రక్కన రాముడు బంగారులేడి కోసం వెళ్ళి ఉన్నాడు. ఆ బంగారు లేడి రూపంలో ఉన్నది రావణునిచే పంపబడిన మారీచుడు.

అలా క్రమంగా రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోయి లంకలో పెట్టుట. రామ లక్ష్మణులు వెతుకుతూ వెళ్ళడం, వానర సాయం, నీలునిచే నిర్మింపజేసిన సముద్ర సేతువు మీదుగా లంకానగరం వెళ్ళి ముట్టడించడం. రావణ సంహారం. చివరికి పల్లకీలలో శ్రీరామ లక్ష్మణులు అయోధ్యా నగరానికి తిరిగి చేరుటను రుమాలు మధ్యభాగంలో చూపించారు.



[ఆధారం - న్యూయార్కు నగర మెట్రోపోలిటన్ మ్యూజియము.]