తన్త్రీలయ సమన్వితః

*తన్త్రీలయ సమన్వితః*

"గానమితి రామాయణః
తన్త్రీలయ సమన్వితః ।
మనోరమామ్ సర్వజనైః

తన్మనో మాలిన్య హరః

మూలం వాల్మీకి తెలుగు రామాయణం

1-2-18-అనుష్టుప్

"పాదబద్ధః అక్షరసమః
తన్త్రీలయ సమన్వితః ।
శోకార్తస్య ప్రవృత్తో మే
శ్లోకో భవతు నాన్యథా"

టీక:   పాదబద్ధః = నాలుగు పాదములతో కూర్చబడినది, అక్షరసమః = సమానమైన అక్షరములు కలది, తన్త్రీ = వీణాతంత్రులపై, లయ = కూర్చుటకు తగిన లయతో, సమన్వితః = కూడినది అయిన, శోకా౭౭ర్తస్య = శోకముతో, ఆర్తస్య = ఆర్తిచెందినవాడనై ఉండగా, ప్రవృత్తః = అప్రయత్నముగా పలికిన పలుకు, మే =నానుండి, శ్లోకః = శ్లోకముగా, భవతు = అగుగాక, = కాదు, అన్యథా = మరొకవిధముగా.

భావము:   శోకార్తుడనై ఉండగా నేను అప్రయత్నంగా పలికినట్టిది, సమానమైన అక్షరములు గల నాలుగు పాదములలో కూర్చబడినది, వీణపై లయతో కూర్చి పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున ఇది శ్లోకము అను పేరుతో మాత్రమే ప్రసిద్ధి కావలెను.