Special Casual Leave

*ప్రత్యేక ఆకస్మిక సెలవులు:*

*(Special Casual Leave )*

🍀 ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.

☘ ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.

☘ ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు.

☘ క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు.

*(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)*

☘ సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.

☘ రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది.

*(G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)*

☘ పురుష ఉద్యోగులు వేసక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి ఆరు రోజులకు(6)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల ఆరు(6) రోజులు మంజూరుచేయవచ్చు.

*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*

*(G.O.Ms.No.257 F&P తేది:05-01-1981)*

☘ మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పధ్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.

*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*

*(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)*

☘ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స భార్య చేయించుకున్నచో ఆమెకు సహాయం చేయుటకు ఉద్యోగి అయిన భర్తకు ఏడు(7) రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

*(G.O.Ms.No.802 M&H తేది:21-04-1972)*

☘ మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

*(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)*

☘ ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.

*(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)*

☘ మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

*(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)*

☘ మహిళా ఉద్యోగులు గర్భవిచ్చితి(Medical Termination of Pragnancy) తర్వాత Salpingectomy(గర్భాశయనాళo తొలగింపు) ఆపరేషన్ చేయించుకున్నచో సందర్భంలో పద్నాలుగు(14) రోజులకు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందవచ్చు.

*(G.O.Ms.No.275 F&P తేది:15-05-1981)*

☘ చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.

*(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)*

☘ పురుష ఉద్యోగులకు భార్య ప్రసవించినపుడు 15 రోజుల పిత్రుత్వ సెలవు మంజూరుచేస్తారు.

*(G.O.Ms.No.231 తేది:16-09-2005)*

☘ ప్రభుత్వ గుర్తింపు కలిగి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలకు చెందిన జిల్లా ప్రధాన బాధ్యులకు సంఘ కార్యకలాపములకు హాజరగు నిమిత్తం అదనంగా 21 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవు మంజూరు సదుపాయం కలదు.

*(G.O.Ms.No.470 GAD తేది:16-09-1994)*

*(G.O.Ms.No.1036 GAD తేది:29-11-1995)*