Leave Sanction Officer

*సెలవు మంజూరు అధికారం:*

*G.O.Ms.No.58* విద్య తేది:22-04-2008 ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు అధికారం,కాలపరిమితుల పై ఉత్తర్వులు ఇవ్వబడినవి, కాలక్రమేణ ఆ నియమాలను సవరిస్తూ *G.O.Ms.No.70* విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరు చేయాలో తాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

*ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:*

ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు, ఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు మించకుండా మంజూరు చేస్తారు.

*ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:*

ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు

4 నెలల వరకు మంజూరు చేస్తారు.

*ప్రసూతి సెలవు(Maternity Leave):*

మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల వరకు సెలవు మంజూరు చేసే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు G.O.Ms.No.84 తేది:17-09-2012 ద్వారా కల్పించబడింది.

*మండల విద్యాధికారులు:*

తన పరిధిలోని

ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు

ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,

అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

*ఉప విద్యాధికారి:*

తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల, ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత/ అర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరుచేస్తారు.

*జిల్లా విద్యాధికారి:*

జిల్లాలోని ఉపవిద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/అర్ధవేతన, కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం॥ వరకు మంజూరు చేయవచ్చును. జిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి 1 సం॥ వరకు అన్ని రకాల సెలవులు మంజూరు చేస్తారు.

*డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:*

మండలవిద్యాధికారులకు

/ఉన్నత/ ప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను 1 సం॥ నుండి 4 సం॥ వరకు సెలవు మంజూరు చేస్తారు.

🍀 *కొన్ని ముఖ్యాంశాలు:* 🍀

🔮 సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.

🔮 సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.

🔮 నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4వ కేటగిరీకి బదిలీచేస్తారు.

🔮 అధికంగా వాడుకున్న సెలవును FR-18 ప్రకారం అనధికార గైర్హాజరుగా భావించి *డైస్ నాన్* గా ప్రకటిస్తారు.