GPF

*G.O.Rt.No. 1063 dt.2.8.2019 GPF Interest 7.9% from 01.07.2019 to dt .30.09.2019

*G.O.Rt.No.44 dt.04.02.2019 GPF Interest 8% from 01.01.2019 to dt.31.03.2019

**G.O.Rt.No. 895 dt.9.5.2019 GPF Interest 8% from dt.01.04.2019 to dt.30.06.2019

*G.O.MS.No. 171 dt. 18.12.2018 GPF Interest 8% from 01.10.2018 to dt.31.12.2018

*GO.56 dt.28.02.14 APGPF Modification of Form Appendix_S and Proposal New Form

*GO.447 dt.28.11.13 Delegation powers to PGHMs and MEOs to sanction ZPGPF Loan and Partfinal

*Memo.7745 ZPPF Loans Sanction Powers Deligation Orders communicated to ZP CEOs

*జనరల్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ (GPF) *

✴ GPF రూల్స్ 1-4-1935 నుండి అమలులోకి తీసుకురావడం జరిగింది.

✴ ఈ స్కీం ప్రభుత్వ ఉద్యోగులకు 1-3-1963 నుండి తప్పనిసరి చేయబడినది.

✴ తేది 1-9-2004 తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిన వారికి ఈ రూల్స్ వర్తించవు.

*(G.O.Ms.No.654 Fin Dt:22-09-2004)*

✴ చందాదారుడు ఈ ఫండ్ లో చేరే సమయంలో తప్పక తన నామినేషన్ సమర్పించాలి *(రూల్-7)*

✴ ప్రతి చందాదారునికి ఒక అకౌంట్ నెం.అలాట్ చేస్తారు.అందులో చందా వివరాలు మరియు ఆర్జించిన వడ్డీ మొదలగు విషయాలు ఉంటాయి. *(రూల్-8)*

✴ ప్రతి చందాదారుడు నెలనెలా చందా చెల్లించాలి సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులు చందా చెల్లించనవసరం లేదు.

✴ జీతం లేని సెలవు,అర్ధజీతపు సెలవు సందర్భాలలో చందా చెల్లించాలా వద్దా అన్నది ఉద్యోగి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

*(G.O.Ms.No.199 F&P Dt:11-07-1969)*

✴ రిటైర్మెంట్ కంటే నాలుగు నెలల ముందు నుండి చందా చెల్లించనవసరం లేదు.

*(G.O.Ms.No.98 F&P Dt:19-06-1992)*

✴ చందా రూల్-10 లో తెలిపిన రేట్ల ప్రకారం చెల్లించాలి.అంతకంటే ఎక్కువగా అయినా చెల్లించవచ్చు కాని అతను పొందే జీతభత్యాలు (Pay+DA) కు మించరాదు

✴ చందాదారుడు తన చందాను సం॥లో రెండుసార్లు పెంచుకోవచ్చు. అలాగే ఒకసారి తగ్గించుకోవచ్చు.

*(G.O.Ms.No.21 F&P Dt:24-01-1981)*

✴ నాల్గవ తరగతి ఉద్యోగులు బేసిక్ పే పై 4%; ఇతరులు భీమా కలవారు 6%; భీమా లేనివారు 12% చెల్లించాలి.

✴ నెలసరి చందా ఉద్యోగి జీతభత్యాల నుండి రికవరీ చేయాలి.అలగే డిప్యూటేషన్ లో పనిచేసే వారి జీతాల నుండి చందా రికవరీ చేసి చలానా ద్వారా వారి ఉద్యోగి అకౌంట్లో

జమచేయాలి. *(రూల్-12)*

*(G.O.Ms.No.359 F&P Dt:25-10-1993)*

✴ ఉద్యోగి ఖాతాలో నిల్వయున్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం తెలిపిన రేటు ప్రకారం వడ్డీ లెక్కగట్టి చందాదారుని అకౌంట్లో జమచేస్తారు. *(రూల్-13)*

*GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్:*

🦋 చందాదారుడు 20 సం॥ సర్వీసు పూర్తిచేసినా,లేక పదవీ విరమణ చేయడానికి 10 సం॥ మిగిలివున్న ఉద్యోగి తన GPF ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకోవడానికి అనుమతి మంజూరుచేస్తారు *రూల్ -15A*

🦋 గృహసంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సం॥ సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకోవడానికి అర్హత కలదు.

🦋 పదవీ విరమణ పొందడానికి చివరి 4 నెలల సర్వీసులో ఎటువంటి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించబడదు కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించవచ్చును.

*(G.O.Ms.No.98 తేది:19-06-1992)*

🦋 సాధారణంగా 6 నెలల తరువాతనే రెండవ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించాలి లేక ఒక ఆర్ధిక సం॥లో రెండు కంటే ఎక్కువ పార్ట్ ఫైనల్ డ్రాయల్ మంజూరు చేయరాదు *రూల్-15B*

🦋 GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకుంటే ఎటువంటి రికవరీ ఉండదు .

🦋 GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ దరఖాస్తును అపెండిక్స్-O లో సమర్పించాలి.

🦋 ఉద్యోగి పదవీ విరమణ చేసినా,లేక ఉద్యోగానికి రాజీనామా చేసినా లేక మరణించినా అతని ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం అతనికి,అలాగే ఉద్యోగి చనిపోతే అతడు సమర్పించిన నామినేషన్ ప్రకారం కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. నామినేషన్ లేని సందర్భాలలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులందరికీ సమాన వాటాల ద్వారా చెల్లిస్తారు *రూల్-28,29,30*

🦋 GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్,ఫైనల్ విత్ డ్రాయల్ బిల్లులను ఫామ్-40 లో దాఖలు చేయాలి.అలాగే ఫామ్-40A కూడా జతపరచాలి.

🦋 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉద్యోగులకు ప్రధానోపాధ్యాయులు,

మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ మంజూరుచేసి ఫాం-40 తో పాటు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపి సదరు సొమ్మును ఉపాధ్యాయులకు చెక్కు ద్వారా చెల్లిస్తారు.

*(G.O.Ms.No.447 Dt:28-03-2011)*